కరోనా మహమ్మారీ ఊహించని ప్రమాదాలెన్నో తెచ్చింది. ఎన్నో ఆశలకు ఆకాంక్షలకు తూట్లు పొడిచింది. డెబ్యూ హీరోలు.. కంబ్యాక్ అవ్వాలనుకున్న ట్యాలెంట్ కు.. అప్పుడే కొత్తగా వచ్చిన నిర్మాతలకు కూడా ఇది అశనిపాతమే అయ్యింది. ప్రయత్నాలన్నీ మిడిల్ డ్రాప్ అయ్యే పరిస్థితి. ఆరేడు నెలలుగా అసలు థియేటర్లు తెరుచుకోక చిత్రీకరణలు పూర్తి కాక నానా తంటాలు పడుతున్నారు.
ఈ కేటగిరీలోనే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా చేరిపోయారు. ఆయన ఎన్నో హోప్స్ తో మరాఠాలో ఘనవిజయం సాధించిన `నటసామ్రాట్` అనే చిత్రాన్ని తెలుగులో రంగ మార్తాండ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో తన సతీమణి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్- బ్రహ్మానందం లాంటి టాప్ స్టార్లు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చివరి షెడ్యూల్ పెండింగ్ లో ఉండగా మహమ్మారీ విరుచుకుపడింది.
ఇపుడు ఆ షెడ్యూల్ ని పూర్తి చేసి థియేట్రికల్ రిలీజ్ చేయాలన్నది కృష్ణవంశీ ప్లాన్. కానీ అన్ని ప్లాన్స్ కి గండి కొట్టేసింది కరోనా. ఇటీవల థియేటర్లు తెరిచినా జనం రాక ఈగలు తోలే పరిస్థితి కనిపిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మెజారిటీ భాగం థియేటర్లు తెరుచుకోనే లేదు. దీంతో ఇంకా వేచి చూడలేక ఓటీటీలో రిలీజ్ చేసేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. దర్శకుడు ససేమిరా అంటున్నా ఆయన్ని ఒప్పించే పనిలో ఉన్నారని తెలిసింది. పెంగ్విన్ - వి లాంటి చిత్రాలు డిజిటల్లో ఆశించినంత మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ రిలీజ్ అంటే ఆసక్తి కూడా చాలామందికి సన్నగిల్లింది. మరి కృష్ణవంశీ ఏం చేస్తారన్నది చూడాలి.