తెలుగులో సినిమాలలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఇప్పుడు తన క్రియేటివిటీకి పెద్ద పరీక్ష జరగబోతుంది. చానాళ్ళ నుండి హిట్లు లేని కృష్ణవంశీ ఇప్పుడు పట్టుదలతో ‘నక్షత్రం’ సినిమా చేశాడు. రెండు రోజులు క్రితం ఆడియో కూడా విడుదలైంది. ఈ ఆడియో ఫంక్షన్లో డైరెక్టర్ కృష్ణవంశీ ఒక మాట అన్నాడు. “సాధరణంగా నన్ను ఎవరు హింశ పెట్టే సాహసం చేయలేరు, నేనే నటులును హింశపెడతాను” అని కామెంట్ చేశాడు. అయితే మనోడు నిజంగానే క్రియేటివ్ ప్రాసెస్ పేరుతో మ్యూజిక్ డైరక్టర్లకు చుక్కలు చూపించేశాడట.
‘నక్షత్రం’ సినిమా పాటలు మీరు చూస్తే ఇందులో ఉన్న ఆరు పాటలు ఒక్క మ్యూజిక్ కొంపోజర్ చేసినవి కావు. ‘నక్షత్రం’ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారు. భీమ్స్ ఈ సినిమాకు మూడు పాటలుకు చేయగా, భరత్ మధుసూదన్ మరో రెండు పాటలుకు మ్యూజిక్ అందించాడు. మరో మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర ఒక పాటకు ట్యూన్ ఇచ్చాడు. ఒక సినిమాకు ముగ్గురు ఇవ్వడం తప్పుకాదు కానీ, వీళ్ళ కన్నా ముందు సుమారుగా ఒక పది మందిచే పని చేయించాడట అంటా కృష్ణవంశీ. వాళ్ళు చేసిన ఏ పాటలు కృష్ణవంశీ కి నచ్చకపోవడంతో చివరికి ఆ ముగ్గురు ఇచ్చిన పాటలును ఫైనల్ చేసుకున్నాడు.
నిజంగానే ముందులో ఇచ్చిన ట్యూన్లు బాగోకపోవడంతోనే వంశీ అంతమంది మ్యూజిక్ డైరక్టర్లను మార్చాడా అంటే.. అక్కడ వేరే రాగం వినిపిస్తోంది. “కృష్ణవంశీకి ముందు ఏం చెప్పాడనేది అతనికే గుర్తుకు ఉండదు. ఒక పాట ఏ థీమ్ మీద తీస్తున్నాం అనేది మరిచిపోతాడు. తన ఐడియాలు స్థిరంగా ఉండవు. దాని వలన ఆయన్ను శాటస్ఫై చేయడం కష్టం” అని చెబుతున్నారు కొందరు. ఏదేమైనా వంశీ ఇలా అందిరితో యుద్దం చేసి మరి ఆరు ట్యూన్లు రెడీ చేయించాడు. అవి ఎలా ఉన్నాయో మీరే విని చెప్పండి.