`వినయ విధేయ రామ` ప్రీరిలీజ్ ఈవెంట్ కి రాజకీయ రంగం నుంచి డేరింగ్ డ్యాషింగ్ & డైనమిక్ లీడర్ తారక రామారావు(కేటీఆర్) ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ వేదికకు కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అతడి డైనమిక్ స్పీచ్ మెగాభిమానుల్ని సైతం స్పెల్ బౌండ్ చేసేసింది. చిరుని, చరణ్ ని అతడు సొంత కుటుంబ సభ్యులుగా వోన్ చేసుకుని మాట్లాడిన తీరుకు అంతా స్టన్ అయిపోయారు. ఇదే వేదిక పై కేటీఆర్ ను మెగాస్టార్ అంతే ఇదిగానూ పొగిడేయడం పై చరణ్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగింది. అన్నయ్య తన మనసుకు దగ్గరైన వారిని ఓ రేంజులో పొగిడేస్తారు.. గొప్ప సత్సంబంధాల కోసం ఆసక్తి చూపిస్తారు. రాజకీయాల్లో బ్రిలియంట్ లీడర్ గా నిరూపించుకున్న కల్వకుంట్ల వారసుడు, కాబోయే సీఎం కేటీఆర్ తోనూ మెగా చనువు గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఈ వేదిక పై కేటీఆర్ ని పొగిడేస్తూ మెగాస్టార్ అదిరిపోయే ఛలోక్తులు విసిరారు. మచ్చుకు ఓ చలోక్తిని పరిశీలిస్తే.. ``మేమిద్దరం ఒకే బెంచ్ మేట్స్.. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉంది.. ఏ స్కూల్ లో, ఏ కాలేజ్ లో అని అడగొద్దు.. అసెంబ్లీలో మేమిద్దరం ఒకే టైమ్ లో ఎమ్మెల్యేలుగా ఉన్నాం`` అంటూ ఉల్లాసంగా మాట్లాడేశారు. ``ఆ టైమ్ లో తనని గమనించేవాడిని. చాలా మృధు స్వభావిలా ఉన్నాడే అనుకున్నాను.. కానీ అస్సలు కాదు.. అతడి మాటల దాడి.. వాగ్ధాటి ఆ తర్వాత చూశాను. సమర్ధుడైన నాయకుడి లక్షణాలు కనిపించాయి. ఎంతో ప్రతిభావంతుడిగా అతడు అంతర్జాతీయ వేదికల పై ఆంగ్లంలో మాట్లాడి తెలుగు వాడి గౌరవాన్ని నిలబెట్టారు. అలాంటి నాయకుడు మనకు అవసరం`` అని చిరు పొగిడేశారు.
వాస్తవానికి చిరు `మేమిద్దరం ఒకే బెంచ్ మేట్స్` అంటూ చాలానే ఫన్ క్రియేట్ చేశారు. ఆ క్రమంలోనే తారక రామారావు ముసిముసిగా నవ్వేసుకున్నారు. చెర్రీ వైపు తిరిగి కన్ను గీటడం పైనా ఆసక్తికర చర్చ సాగింది. మొత్తానికి సాయంత్రం వేళ సరదా సరదాగా విధేయ రాముని కార్యక్రమం ముగించారు.