ప్రభాస్ మరియు పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. గత రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ సినిమా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడదనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాధేశ్యామ్ పబ్లిసిటీ కార్యక్రమాలు షురూ కాలేదు.
సంక్రాంతి సమయంలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన సమయంలో కూడా పబ్లిసిటీ హడావుడి ఎక్కువగా కనిపించలేదు. ఇలాంటి పెద్ద సినిమాలకు కనీసం నెల రోజుల నుండే మీడియాలో హడావుడి ఉండాలి.. వివిధ రాష్ట్రాల్లో పబ్లిసిటీ ఈవెంట్స్ జరుగుతూ ఉండాలి. కాని రాధేశ్యామ్ విషయంలో అవేమి జరగడం లేదు. అసలు రాధేశ్యామ్ మళ్లీ వాయిదాపడుతుందా అనే అనుమానాలు కొందరిలో కలిగేలా సైలెన్స్ మెయింటెన్స్ చేస్తున్నారు.
పబ్లిసిటీ సైలెన్స్ వెనుక చిత్ర యూనిట్ సభ్యుల వ్యూహం ఉందంటున్నారు. సినిమాకు భారీ హైప్ తీసుకు రాకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా అభిమానుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా బాహుబలి స్టార్ సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. కనుక ఈ సినిమా కు ఇంకా పబ్లిసిటీ చేయడం ద్వారా భారీ హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
సినిమాను తక్కువ హైప్ తో విడుదల చేయడం వల్ల పెద్ద విజయం సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ వ్యూహం గతంలో కొన్ని సినిమాలకు అనుసరించడం జరిగింది. భారీ హైప్ ఉన్న సినిమా ల విషయంలో కొన్ని సార్లు అంచనాలు తప్పిన సందర్బాలు ఉన్నాయి. కాని హైప్ లేకుండా వచ్చిన సినిమాలు ఎక్కువ సార్లు ఊహించని ఫలితాన్ని దక్కించుకున్నాయి. అందుకే రాధేశ్యామ్ సినిమా విషయంలో సైలెన్స్ ను మెయింటెన్ చేస్తున్నారట.
రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ జోతిష్యుడు గా కనిపించబోతున్నాడు. తన ప్రేమను తాను దక్కించుకునేందుకు విధిని ఎదిరించిన అతడి జీవితంలో జరిగిన పరిణామాలు ఏంటీ అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. రాధేశ్యామ్ సినిమా ఒక పక్కా కమర్షియల్ సినిమా అస్సలే కాదని మేకర్స్ మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. సినిమా లో యాక్షన్ సన్నివేశాలు.. కామెడీ ట్రాక్ కాని.. కామెడీ సన్నివేశాలు కాని ఉండవు అంటున్నారు.
అయినా కూడా ప్రేక్షకులు సినిమా పై చాలా అంచనాలు పెంచుకుని ఎదురు చూస్తున్నారు. రాధేశ్యామ్ సినిమాను భారీ హైప్ వచ్చేలా ఖర్చు పెట్టి ప్రమోషన్స్ అయితే చేయడం లేదు కాని రికార్డు స్థాయి స్క్రీన్ ల్లో స్క్రీనింగ్ అయ్యే ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. లో ప్రొఫైల్ లో విడుదల అవ్వడం వల్ల ఖచ్చితంగా రాధేశ్యామ్ కు మంచి స్పందన దక్కే అవకాశం ఉంది. రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మార్ఇచ 5 నుండి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట.