ఫోటో స్టోరి: వారెవ్వా.. ఏమి పోజు రాయ్

Update: 2017-09-04 06:28 GMT
సౌత్ సినిమాల్లో హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి ఓ రేంజ్ లో వెలిగిపోతోంది. తమిళ్ మూవీస్ లో హీరోయిన్ గా.. తెలుగు సినిమాల్లో ఐటెం భామగా మెరుపులు మెరిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు నార్త్ లో సత్తా చాటేందుకు రెడీ అయిపోయింది. సూపర్ హిట్ మూవీ జూలీకి సీక్వెల్ గా జూలీ2 అంటూ బాలీవుడ్ జనాలను మత్తెక్కించేందుకు రాయ్ లక్ష్మీ రెడీ అయిపోగా.. ఈ మూవీ రిలీజ్ కాసింత ఆలస్యం అయినా.. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా అనేక పబ్లిసిటీ పోస్టర్లు వచ్చేస్తున్నాయి. వీటికి తోడు ఈ ఈరోటిక్ మూవీకి సంబంధించిన స్టిల్స్ తనే కొన్నిటిని జనాలకు చూపించేస్తోంది. తాజాగా ఈ భామ జనాలకు చూపించిన ఫోటోల్లో ఒకటే.. ఈ బీచ్ లో సేదతీరుతున్న పిక్చర్. టూపీస్ బికినీలో సింగిల్ పీస్ మాత్రమే ఒంటిమీద ఉన్నట్లుగా రాయ్ లక్ష్మి ఇచ్చిన లుక్ కుర్రాళ్లకు మతులు పోగొట్టేస్తోంది. తన అందాలకు అడ్డుగా ఓ పుస్తకాన్ని.. ఎండనుంచి తలను కవర్ చేస్తూ మరో అడ్డును పెట్టుకున్న రాయ్ లక్ష్మి.. జూలీ2 కోసం అందాలు కుమ్మరించడంలో తాను ఏ మాత్రం తగ్గలేదని చెప్పకనే చెప్పింది.

అసలు కెమేరా ముందు ఈ భామ బికినీ వేయడం.. జూలీ2 కోసమే కావడం విశేషం. తనకు బాలీవుడ్ నుంచి రెడ్ కార్పెట్ లభించేందుకు ఈ చిత్రం బాగా హెల్ప్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది రాయ్ లక్ష్మి.
Tags:    

Similar News