ఫోటో స్టోరి: క‌రోనా రాకూడ‌దంటే ఇలా ఎండ‌లో 3గం.లు ఉండాలి!

Update: 2021-04-17 05:30 GMT
పంచ్ పంచ్ కో మీనింగు ఉంటుంది. ఇంత‌కుముందే ఆర్జీవీ ట్విట్ట‌ర్ లో ఒక ఫోటో షేర్ చేసి దానిపై పంచ్ వేశారు. దాని సారాంశం ఇలా ఉంది. 6 వారాల్లో 17ల‌క్ష‌ల ముంబై వాసులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ 1రోజుల‌నే 35ల‌క్ష‌ల మంది మ‌హా కుంభ‌మేళాలో మునిగితేలారు! ప్ర‌జ‌ల‌కు ఈ లైఫ్ కంటే నెక్ట్స్ లైఫ్ మీదే మోజెక్కువ‌!! అంటూ త‌న‌దైన శైలిలో పంచ్ వేశారు. నాస్తికుడు అయిన ఆర్జీవీ అప్పుడ‌ప్పుడు దేవుడికి మొహ‌మాటం కొద్దీ ద‌ణ్ణం పెట్టినా.. వీలున్న‌ప్పుడ‌ల్లా ఆధ్యాత్మిక వ్య‌వ‌హారాల‌పై పంచ్ లు వేస్తూనే ఉన్నారు.

అదంతా స‌రే కానీ..ఇక్క‌డ `తిక్క` సుంద‌రి ఏం చేస్తోందో చూశారు క‌దా! గ‌మ్మ‌త్త‌యిన త‌న అందాల‌ను అలా ఎండ‌లో ఆర‌బెట్టింద‌ని మీరు భావిస్తే త‌ప్పులో కాలేసిన‌ట్టే. క‌రోనా మ‌హ‌మ్మారీ సోకకుండా ఉండాలంటే నిత్యం 3 గంట‌లు ఇలా ఎండ‌లోనే ఉండాల‌ట‌. విట‌మిన్ డి పుష్క‌లంగా ల‌భించేవారికి క‌రోనా సోక‌దు. చెమ‌ట ప‌ట్టేలా ప‌ని చేసేవారిని క‌రోనా వైర‌స్ ఏమీ చేయ‌లేద‌ని వైద్యులే చెబుతున్నారు.

పాపం తిక్క బ్యూటీ లారెస్సి బోనేసి అదేమీ తెలియ‌క‌పోయినా కానీ.. ఇలా ఎండ‌లో శ్ర‌మిస్తోంది... ఇదే హార్డ్ వ‌ర్క్ ని కొన‌సాగిస్తే ఫామ్ లోకి వ‌చ్చేసిన సాయి తేజ్ పిలిచి ఓ అవ‌కాశం ఇస్తాడ‌న‌డంలో సందేహ‌మేం లేదు బోనేసీ..!! తిక్క‌తో ఫ్లాపిచ్చినందుకు ఇప్పుడో హిట్టివ్వాలి త‌న‌కోసం. పంచ్ పంచ్ కో తిక్క లెక్క ఉండాలి క‌దా!! అందుక‌ని..!!
Tags:    

Similar News