కన్నడ రాక్ స్టార్ యశ్ మరియు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన కేజీఎఫ్ 2 గత ఏడాదిలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. కేజీఎఫ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేజీఎఫ్ 2 పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా భారీ హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కించాడని టీజర్ చూస్తనే అర్థం అయ్యింది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు మళ్లీ ఖాయం అంటున్నారు. కొన్ని నెలల క్రితం కేజీఎఫ్ 2 షూటింగ్ ముగిసింది అనే వార్తలు కన్నడ మీడియాలో వచ్చాయి. కేజీఎఫ్ 2 సినిమా కు గుమ్మడి కాయ కొట్టిన తర్వాతే ప్రభాస్ సలార్ మూవీకి కొబ్బరి కాయను ప్రశాంత్ నీల్ కొట్టాడు. కాని తాజాగా కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ బెంగళూరులో జరగడం చర్చనీయాంశంగా మారింది.
మొన్నటి వరకు ప్రభాస్ తో సలార్ సినిమా షూటింగ్ చేసిన ప్రశాంత్ నీల్ ఆ సినిమా షెడ్యూల్ గ్యాప్ లో కేజీఎఫ్ 2 రీ షెడ్యూల్ చేశాడు అంటూ ప్రచారం జరుగుతోంది. కన్నడ మీడియా వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయంగా సమాచారం ప్రకారం కేజీఎఫ్ 2 విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. కనుక మరోసారి కేజీఎఫ్ 2 లోని సన్నివేశాల విషయంలో తుది నిర్ణయానికి వచ్చి సరిగా రాని షాట్స్.. సీన్స్ ను రీ షూట్ చేయాలని ప్రశాంత్ నీల్ భావించాడట. అందుకోసం ఇటీవల రీ షూట్ చేశాడని సమాచారం అందుతోంది. కేజీఎఫ్ 2 లో ప్రతి సన్నివేశం ది బెస్ట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ నీల్ రీ షూట్ కు వెళ్లాడు అంటూ యూనిట్ సభ్యులు కూడా అనధికారికంగా చెబుతున్నారు. రీ షూట్ విషయమై యూనిట్ సభ్యుల నుండి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
కేజీఎఫ్ 2 ను కన్నడంతో పాటు సౌత్ లో అన్ని భాషలు మరియు హిందీలో విడుదల చేయబోతున్నారు. ఇండియాలోనే కాకుండా పలు దేశాల్లో అయిదు భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి కేజీఎఫ్ 2 వసూళ్లు రికార్డు సృష్టించేలా ఉండాలని మేకర్స్ బలంగా కోరుకుంటున్నారు. అందుకే ప్యాచ్ వర్క్.. రీ షూట్.. రీ ఎడిట్ ఇలా చాలా చేస్తున్నారని అంటున్నారు. ఏం చేసినా కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు.. ఒక మంచి సినిమాను అందించేందుకు కనుక ఖచ్చితంగా మేకర్స్ నిర్ణయాలను మరియు వారి షూట్ లను గౌరవించాల్సిందే అంటూ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు. అప్పటి వరకు మళ్లీ ఏమైనా మార్పులు చేర్పులు వస్తాయా అనేది చూడాలి.