సినిమా రిలీజ్ అడ్డుకున్నారు.. వీరికి ఏమైనా బుద్ధి ఉందా!

Update: 2022-03-10 10:27 GMT
తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన జై భీమ్‌ సినిమా ఆస్కార్‌ నామినేషన్స్ వరకు వెళ్లింది అంటే ఖచ్చితంగా అది మన సౌత్‌ సినీ ప్రేమికులు మరియు ప్రేక్షకులు గౌరవంగా భావించాల్సిన విషయం. ఆస్కార్‌ ఎంట్రీ దక్కడం గగనంగా మారిన సౌత్‌ సినిమాలు ఏకంగా నామినేషన్‌ కు ముందు ఒక్క అడుగు వరకు వెళ్లడం అంటే చాలా పెద్ద విషయం. అలాంటి సినిమా ను కొందరు వివాదం చేయాలని చూశారంటూ సూర్య అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జై భీమ్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ అవ్వడంతో వారికి అడ్డుకునేందుకు వీలు లేకుండా పోయింది. పీఎంకే అనే ఒక పార్టీకి చెందిన నాయకులు జై భీమ్ సినిమా తమ మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందంటూ.. అందులో ఒక సన్నివేశం మాకు చాలా మనస్థాపం ను కలిగించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా విడుదల అయ్యింది.. ఒక వర్గం వారికి  ఇబ్బంది కలిగింది.. సినిమా హడావుడి తగ్గి పోయింది కనుక వివాదం సర్ధుమనగాలి కదా.. కాని మళ్లీ వివాదం రాజుకుంది.

సూర్య నటించిన ఈటీ సినిమా నేడు విడుదల అయ్యింది. సూర్య ఇప్పటి వరకు జై భీమ్ సినిమాకు సంబంధించిన వివాదం విషయంలో క్షమాపణలు చెప్పలేదు అంటూ ఆయన నటించిన ఈటీ సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో పలు చోట్ల పీఎంకే నాయకులు మరియు కార్యకర్తలు కలిసి సూర్య ఈటీ సినిమా షో లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చాలా థియేటర్ల వద్ద హడావుడి చేసి వారు తమ తమ హక్కుల కోసం నినాదాలు చేస్తున్నారు.

జై భీమ్‌ సినిమా వివాదం ముగిసి పోయింది. ఇప్పుడు ఈటీ సినిమా విడుదలను వారు అడ్డుకోవడం అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసం అంటూ సూర్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమిళ సినిమా స్థాయిని పెంచడంతో పాటు.. తమిళ సినిమా ను ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా జై భీమ్ ఉంటే ఇప్పుడు మీరు రాజకీయం చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు.

సినిమాల విషయంలో రాజకీయాలు చేస్తున్న వారికి అసలు బుద్ది ఉందా అంటూ సూర్య అభిమానులు మరియు సినీ ప్రేమికులు తమిళనాడు సోషల్‌ మీడియా వర్గాల వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్యింది. ఆ సినిమా వివాదాన్ని కొత్తగా విడుదల అయిన ఈటీ పై రుద్దేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News