ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం చాలా తేలిక అని చాలా మంది అనుకుంటారు. కానీ స్టైట్ సినిమా కంటే రీమేక్ చేయడంలోనే ఎక్కువ కష్టం .. కసరత్తు ఉంటాయి.
ఒక భాషలో ఆల్రెడీ హిట్ అయిన సినిమాను రీమేక్ చేసేటప్పుడు ఆ కథను నేటివిటీకి తగినట్టుగా మార్చుకోవడం చాలా పెద్ద పని. అలాగే ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా .. ప్రధాన పాత్రధారలకు గల క్రేజ్ కి తగినట్టుగా మార్పులు చేసుకుంటూ వెళ్లవలసి ఉంటుంది. అచ్చు అలాగే తీస్తే .. ఒరిజినల్ చూసేవాళ్లం కదా అంటారు. కొత్త అంశాలు జోడిస్తే చెడగొట్టారని అంటారు.
అందువలన ఒక సినిమాను రీమేక్ చేయడం కత్తిమీద సాములాంటి పనే.'వకీల్ సాబ్' ను రీమేక్ చేయడం వేరు .. ఎందుకంటే ఆ కథ అంతా కూడా పవన్ నడిపిస్తాడు. కానీ 'భీమ్లా నాయక్' విషయానికి వచ్చేసరికి రానా ఇమేజ్ యాడ్ అవుతుంది. సినిమాకి మల్టీ స్టారర్ లక్షణాలు వచ్చేస్తాయి. అందువలన ఈ కథపై కసరత్తు చేయడానికి త్రివిక్రమ్ రంగంలోకి దిగవలసి వచ్చింది. ఆయనే స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చవలసి వచ్చింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన విడుదలై థియేటర్లను దడదడ లాడించేస్తోంది.
ఈ సినిమా చూసినవారికి .. సునీల్ .. హైపర్ ఆది .. సప్తగిరి ఒక సాంగ్ లో కనిపిస్తారు. జైల్లో చిత్రీకరించిన పాటలో వాళ్లని చూపిస్తారే గానీ, వాళ్లని ఏ సందర్భంలో భీమ్లా నాయక్ ఎలా పట్టుకున్నాడనేది చూపించరు. అక్కడ తప్ప వాళ్లు ఎక్కడా కనిపించరు. అలాగే కొన్ని సీన్స్ కి లీడ్ ఉండదు ... మరి కొన్ని సీన్స్ చివరలు సరిగ్గా తెగనట్టుగా అనిపిస్తాయి. అందుకు కారణం నిడివిని దృష్టిలో పెట్టుకుని చేసిన కోతలేనట. అలాగే ఈ సినిమాలో ఖైదీలకు పవన్ క్లాస్ తీసుకునే సీన్ కూడా ఉందట. ఆ సీన్ కూడా కోతకి గురైందని చెప్పుకుంటున్నారు.
త్రివిక్రమ్ రాసిన ఈ సీన్ ఎక్స్ ట్రాగా అనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం కావడంతో ఈ సీన్ ను తొలగించినట్టుగా తెలుస్తోంది. అలాగే సునీల్ .. సప్తగిరి .. హైపర్ ఆది కామెడీ సీన్స్ ను కూడా లేపేశారని అంటున్నారు. త్రివిక్రమ్దా దగ్గరుండి మరీ దాదాపు 20 నిమిషాల సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించినట్టుగా చెబుతున్నారు.
అందువల్లనే కొంతమంది ఆర్టిస్టులు హఠాత్తుగా ఫ్రేమ్ లోకి వచ్చినట్టుగా అనిపిస్తుందట. ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేసేటప్పుడు మాత్రం ఈ సన్నివేశాలను యాడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఓటీటీలో ఈ సినిమాను కొత్త సన్నివేశాలను కలుపుకుని చూడొచ్చన్నమాట.