అలీ ఒకానొక సమయంలో హీరోగా వరుస సినిమాలు చేశాడు. ఆ సమయంలో ఆయన సరసన నాయికగా మాలాశ్రీ చెల్లెలు శుభశ్రీ నటించింది. ఈ ఇద్దరూ కలిసి 5 సినిమాలలో వరుసగా నటించారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడలో దాదాపు 30 సినిమాల వరకూ చేసిన శుభశ్రీ, వివాహమైన తరువాత సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చింది. ఆమె చేసిన సినిమాల్లో 'జెంటిల్ మేన్'లోని పాత్ర .. 'పెదరాయుడు'లోని టీచర్ పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తు. అలాంటి శుభశ్రీ 25 ఏళ్ల తరువాత 'ఆలీతో సరదాగా' కార్యక్రమం కోసం కెమెరా ముందుకు వచ్చింది.
ఈ సమయంలోనే అలీ .. గతంలో తాము కలిసి నటిస్తున్నప్పుడు వచ్చిన ఒక పుకారును గురించి సరదాగా ప్రస్తావించాడు. 'అల్లరి పెళ్లి కొడుకు' సినిమాలో మనిద్దరం కలిసి నటించాం. ఆ సినిమాలో మన ఇద్దరికీ పెళ్లి అవుతుంది. ఆ ఫొటో ఎలా బయటికి వచ్చిందో తెలియదు.
అప్పట్లో ఒక మేగజైన్ లో గాసిప్స్ రాస్తుండేవారు. ఆ మేగజైన్ వారి చేతికి ఆ ఫొటో చిక్కింది. వాళ్లు 'అలీకి శుభశ్రీతో పెళ్లి జరిగిపోయింది' అని రాసేశారు. ఆ రోజున మా మామగారు మా ఆవిడను వెంటబెట్టుకుని పుట్టింటికి తీసుకుని వెళుతున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆయన ఆ మేగజైన్ కొన్నారు. ట్రైన్ బయల్దేరింది .. ఒక్కో పేజీ తిరగేస్తూ వెళుతున్న ఆయన, 'శుభశ్రీ తో అలీ పెళ్లి' ఆర్టికల్ చూసి కంగారు పడిపోయారు. ఆ మేగజైన్ తన కూతురు కంటపడకుండా తీసుకుని వెళ్లారు. రైలు దిగిన తరువాత అప్పుడు ఆయన విషయం చెప్పారు. అంతే ఆ సాయంత్రమే మా ఆవిడ వాళ్ల నాన్నగారిని వెంటబెట్టుకుని హైదరాబాద్ వచ్చేసింది. వాళ్లు అంత హఠాత్తుగా తిరిగి రావడంతో మా అమ్మగారు ఆశ్చర్యపోయింది. 'అమ్మాయి ఎందుకో ఏడుస్తోంది .. అందుకే తీసుకుని వచ్చాను' అని మా మావయ్య చెప్పాడు.
నాకు మాత్రం ఏదో డౌట్ కొడుతోంది. ఎందుకు ఇంత తొందరగా వచ్చారా అని అనుకుంటున్నాను. ఏం జరిగింది ? అని మా ఆవిడను అడిగాను. ఏడుస్తూనే ఆమె నాకు మేగజైన్ చూపించింది. నేను నవ్వుతూ .. మొన్న సినిమాలో భాగం గా షూటింగులో పెళ్లి సీన్ జరిగింది .. ఆ సీన్ కి సంబంధించిన ఫొటో అది అని చెప్పాను. అప్పుడు గానీ ఆమె మనసు కుదుటపడలేదు. మీరు ఎదురుపడితే ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను .. అది ఇప్పటికి కుదిరింది" అని అలీ అనగానే, 'అయ్యో ఈ విషయాలేవీ నాకు తెలియదు' అంటూ శుభశ్రీ నవ్వేసింది.