మాస్ మహారాజా రవితేజ స్పీడు మామూలుగా లేదుగా.. వరుస ప్రాజెక్ట్ లని బ్యాక్ టు బ్యాక్ లైన్ లో పెట్టేసిన ఆయన రాకెట్ స్పీడుతో వరుస షెడ్యూల్స్ ని పూర్తి చేస్తూ షాకిస్తున్నారు. గత ఏడాది `క్రాక్` బ్లాక్ బస్టర్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన మాస్ మహారాజా రవితేజ వరుసగా నాలుగు చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా వున్నారు. ఇప్పటికే ఆయన నటించిన `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయిపోతోంది. శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని జూన్ 17న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే ఇప్పటికే సెట్స్ పై వున్న మూడు చిత్రాల షూటింగ్ లని కూడా రాకెట్ స్పీడుతో పూర్తి చేస్తున్నారు. త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో చేస్తున్న `ధమాకా` మూవీ కి సంబంధించిన కీలక యాక్షన్ ఘట్టాలతో పాటు టాకీ పార్ట్ లోకి కీలక పోర్షన్ ని కూడా పూర్తి చేసిన రవితేజ ఈ మంగళవారం స్టూవర్టు పురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న `టైగర్ నాగేశ్వరరావు` చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలు పెట్టారు.
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ మూవీ ద్వారా వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే ఫిబ్రవరిలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంఛనంగా మొదలైన `రావణాసుర` చిత్రాన్ని కూడా మాస్ రాజా పరుగులు పెట్టిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈమూవీ తాజాగా మరో షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.
ఇంటెన్స్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. లేడీ విలన్ గా నెగెటివ్ పాత్రలో దక్షా నాగర్కర్ కనిపించబోతోంది. ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఓపెనింగ్ రోజే ఈ పాత్రకు సంబంధించిన లుక్ ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
సినిమాలో హైలైట్ విషయం ఏంటంటే మాస్ మహారాజా `రావణాసుర` టైటిల్ కి తగ్గట్టే పది రకాల గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయనున్నారని తెలిసింది. ఈ గెటప్స్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. విభిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ మూవీని భారీ స్థాయిలో సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. `అర్జున్ రెడ్డి` ఫేమ్ హర్షవర్థన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి సంథింగ్ స్పెషల్ సర్ ప్రైజ్ లని అందించబోతున్నామని మేకర్స్ వెల్లడించారు.