టైమ్ వున్నప్పుడే అంతా సెట్ చేసుకోవాలి.. అవకాశం చిక్కినప్పుడే అనుకున్నది రాబట్టుకోవాలి. టైమ్ వచ్చినప్పడే డిమాండ్ చేయాలి.. అన్నట్టుగా మారింది మన టాలీవుడ్ హీరోయిన్ ల పరిస్థితి. మన టాలీవుడ్ లో హీరోయిన్ ల షార్టెజ్ వుండటంతో అందుబాటులో వున్న హీరోయిన్ ల డిమాండ్ మామూలుగా వుండటం లేదు. ఫ్లప్ మూవీలో చేసినా.. కొంచెం ఫరవాలేదని బజ్ వినిపించినా మన వాళ్లు ఆయా చిత్రాల్లో నటించిన హీరోయిన్ వెంట పడుతున్నారు. ఎంత డిమాండ్ చేసినా మీరే కావాలంటూ ఫాలో అయిపోతున్నారు.
దీంతో సదరు హీరోయిన్ లు తమ క్రేజ్ ని బట్టి భారీగానే డిమాండ్ చేస్తున్నారు. ఇలా డిమాండ్ చేస్తున్న వాళ్లలో ఒక్క హిట్టు పడిన వాళ్లున్నారు. అసలు హిట్టే లేని వాళ్లు కూడా వున్నారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన చిత్రం `పెళ్లిసందD`. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రొనంకి డైరెక్ట్ చేసిన ఈ మూవీతో శ్రీలీల హీరోయిన్ గా పరిచయమైంది. అభినయం, అంతకు మించిన అందంతో తొలి మూవీతో ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. తొలి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మలి చిత్రంగా మాస్ రాజా రవితేజ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. బిగ్ ఆఫర్ రావడంతో రెమ్యునరేషన్ ని కూడా పెంచేసింది.
టాలీవుడ్ లో పాథ్ బ్రేకింగ్ మూవీగా సంచలనం సృష్టించిన చిత్రం `అర్జున్ రెడ్డి`. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు షాలిని పాండే. తొలి చిత్రం హ్యూజ్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో షాలినికి ఆఫర్ల వెల్లువ మొదలైంది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోయింది. అవకాశాల్ని కూడా మరింతగా పెంచుకోలేకపోయింది. కారణం షాలిని తన క్రేజ్ కి మించి డిమాండ్ చేయడమేనని తెలిసింది.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తొలి చిత్రం `పెళ్లి చూపులు`. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జాతీయ స్థాయిలో పాపులర్ కావడమే కాకుండా ఉత్తమ డైలాగ్స్ పరంగా దర్శకుడికి అవార్డుని కూడా అందించింది. ఇదే చిత్రంతో రీతు వర్మ హీరోయిన్ గా పరిచయం అయింది. ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి `ఒకే ఒక జీవితం` చిత్రంలో నటిస్తోంది. ఈమె కూడా సక్సెస్ లు ఆశించిన స్థాయిలో లేకపోయినా పారితోషికం మాత్రం భారీగానే డిమాండ్ చేస్తోందట.
సుశాంత్ హీరోగా నటించిన చిత్రం `ఇచ్చట వామనములు నిలుపరాదు`. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీనాక్షీ చౌదరి. మాస్ రాజా రవితేజ `ఖిలాడీ`లో అవకాశం రావడంతో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం అడివి శేష్ తో కలిసి `హిట్ : ద సెకండ్ కేస్`లో నటిస్తోంది. ఓ తమిళ సినిమా కూడా కమిట్ అయిన మీనాక్షీ చౌదరి `ఖిలాడీ` తరువాత పారితోషికాన్ని భారీగానే పెంచేసిందని, నిర్మాతలని భయపెడుతోందని చెబుతున్నారు.
ఇదే చిత్రంలో నటించిన డింపుల్ హయాతీ కూడా అందాల ఆరబోతకు రెడీ అంటూ నిర్మాతలని భారీగానే డిమాండ్ చేస్తోందట. ఇక `డీజే టిల్లు` సూపర్ హిట్ కావడం, ఈ సినిమా ప్రచారంలో భాగంగా పుట్టు మచ్చల వ్యవహరంతో పాపులర్ అయిన హీరోయిన్ నేహా శెట్టి. తను కూడా డీజే టిల్లు హిట్ తో భారీగా పెంచేసిందని, దీంతో అవకాశాలు ఇవ్వాలనుకున్న వాళ్లంతా పునరాలోచనలో పడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.