ప్రపంచమంతా ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' కోసం ఎంతో ఆసక్తితో .. ఆతృతతో ఎదురుచూస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇంతవరకూ రాజమౌళి తెరకెక్కిస్తూ వచ్చిన సినిమాలకీ .. ఈ సినిమాకి తేడా ఉంది. ఈ సినిమాతో మొదటిసారిగా చరిత్రను .. మల్టీ స్టారర్ ను ఆయన టచ్ చేశారు. అందువలన ఈ సినిమాతో మరింత రిస్క్ తీసుకోవలసి వచ్చింది.
రాజమౌళి ఎప్పటికప్పుడు కొత్త జోనర్ ను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. 'యమదొంగ' సినిమాతో ఫాంటసీని టచ్ చేసిన ఆయన, ఆ తరువాత 'బాహుబలి' సినిమాతో జానపదాలను గుర్తుకు చేశారు. 'ఈగ' సినిమాలో తెరపై హీరో కనిపించకపోయినా కథ మొత్తం ఉన్నాడనే ఫీల్ ను కలిగిస్తూ, అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ఆ సినిమాను సంచలనాత్మక చిత్రాల జాబితాలో చేర్చారు. ఇక ఇప్పుడు ఒక కాలంలో జరిగిన చరిత్రకు కాల్పనికతను జోడించి 'ఆర్ ఆర్ ఆర్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు.
ఈ సినిమా తరువాత ఆయన మహేశ్ బాబుతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా అంటే అది చిన్న సినిమా అని అనుకోలేం. ఏ జోనర్లో ఉండొచ్చుననే ఆలోచన మాత్రమే కలుగుతుంది. మహేశ్ బాబును ఆయన ఎలా చూపించనున్నారు? అనే ఆసక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో బాలకృష్ణ కూడా ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరికొంతమంది ఇది మల్టీ స్టారర్ అంటూ రాస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
మహేశ్ బాబుతో సినిమా చేయనున్న మాట వాస్తవం. ఆయనతో ఒక మంచి లైన్ అనుకున్నాము. ఆ లైన్ కి పూర్తి కథా రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇది మల్టీ స్టారర్ కాదు .. ఇందులో మహేశ్ బాబు తప్ప వేరే హీరోలు ఎవరూ ఉండరు. మహేశ్ బాబు సోలో హీరోగా చేసే సినిమా ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్ బాబుతో చేయనున్న సినిమా, 'బాహుబలి' .. 'ఆర్ ఆర్ ఆర్' కంటే కూడా పెద్దది. ఈ సినిమా కథా పరిధి ఎక్కువగా ఉంటుంది. దానిని ఆ స్థాయిలోనే చూపించవలసి ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.