అంటే సుందరానికి ఆమె సొంత డబ్బింగ్

Update: 2022-04-13 05:30 GMT
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న అంటే సుందరానికి సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చకచక జరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో నాని లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెల్సిందే. తాజాగా సినిమా నుండి విడుదల అయిన మొదటి సింగిల్ అంచనాలు మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు.

ఇక ఈ సినిమాలో అత్తారింటికి దారేది ఫేమ్ నదియా కీలక పాత్రలో నటిస్తుంది. ఆమె ఈమద్య కాలంలో చేసిన ప్రతి సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఈ సినిమాలో కూడా కథలో అత్యంత కీలకమైన పాత్రను ఆమెతో దర్శకుడు వివేక్‌ ఆత్రేయ చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవలే ఆమె పార్ట్‌ షూటింగ్‌ ను ముగించారట. సాదారనంగా అయితే షూటింగ్ ను ముగించి తన పని పూర్తి అయ్యిందనే నదియా ఈ సినిమా కోసం డబ్బింగ్‌ చెప్పిందట.

ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు కూడా డబ్బింగ్‌ చెప్పని నదియా ఈ సినిమా కోసం మాత్రం డబ్బింగ్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ బలవంతం చేస్తే ఈ సినిమాలో మొదటి సారి డబ్బింగ్ చెప్పినట్లుగా చెప్పుకొచ్చింది. దర్శకుడు విభిన్నమైన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. సినిమాలోని ఆమె పాత్రకు సొంత డబ్బింగ్‌ అయితేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

నదియా తెలుగు లో మిర్చి.. అత్తారింటికి దారేది తో మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. ఆ సినిమాల తర్వాత అత్త పాత్ర లేదా అమ్మ పాత్రలకు ఆమె కేరాఫ్‌ అడ్రస్ గా నిలిచారు. అందుకే అంటే సుందరానికి సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ గా అప్పట్లో నటించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తోంది.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసగా సినిమాలు చేస్తున్న నదియా మొదటి సారి చేస్తున్న ప్రయత్నం ఎంత మేరకు సఫలం అవుతుంది అనేది చూడాలి. పక్కా కమర్షియల్‌ మూవీగా దర్శకుడు వివేక్ ఆత్రేయ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది. వరుసగా నాని సినిమా లు బాక్సాఫీస్‌ వద్దకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. ఈ సినిమాను ఈ సమ్మర్‌ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.


Full View
Tags:    

Similar News