కొడుకు ఎంట్రీ పై తేల్చిపారేసిన విజయ్!

Update: 2022-04-13 04:14 GMT
తమిళనాట విజయ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా విడుదలవుతుందంటే అక్కడ ప్రతి కాలనీలో పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ప్రతి థియేటర్ దగ్గర జాతర జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ లో ఆయనకి విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాకి .. సినిమాకి దానిని మరింత పెంచుకుంటూ ఆయన వెళుతున్నాడు. విజయ్ కంటూ ఒక స్టైల్ ఉంది .. అది డైలాగ్  డెలివరీలోను .. యాక్షన్ లోను .. డాన్సుల్లోను కనిపిస్తూనే ఉంటుంది. ఆయనలోని ఆ స్టైల్ ను అభిమానులు ఇష్టపడుతుంటారు.

ఆయన తాజా చిత్రంగా రూపొందిన ' బీస్ట్' ఈ రోజున విడుదలైంది. సన్ పిక్చర్స్ వారు అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ సోల్జర్ లా కనిపించనున్నాడు.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదులుతూ వెళ్లిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వెళ్లాయి. పూజ హెగ్డే గ్లామర్ .. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ తనయుడు 'జాసన్' ఎంట్రీ గురించిన ప్రస్తావన వచ్చింది.

అందుకు విజయ్ స్పందిస్తూ .. "నేను హీరోను అయ్యాను కనుక .. నా కొడుకు కూడా యాక్టింగ్ వైపు రావాలని అనుకోవడం లేదు. జాసన్ కచ్చితంగా నటన వైపుకే రావాలంటూ అతణ్ణి నేను ఒత్తిడి చేయడం లేదు. తను ఏ రంగం వైపు వెళ్లాలనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఒకవేళ తాను యాక్టింగ్ వైపు రావాలనుకుంటే నేను  తప్పకుండా సపోర్ట్ చేస్తాను. అతని ఆశయం .. పట్టుదలను బట్టే అతను ముందుకు వెళ్లడం జరుగుతుంది . ఏ విషయంలోనూ నా వైపు నుంచి బలవంతం ఉండదు" అని తేల్చి చెప్పేశాడు.

విజయ్ అభిమానులు మాత్రం ఆ ఫ్యామిలీ నుంచి జాసన్ హీరోగా రావలసిందే అన్నట్టుగా ఎంతో ఆశతో .. ఆసక్తితో  ఏదురుచూస్తున్నారు. తండ్రికి తగిలిన వారసుడిగా ఆయనను తెరపై చూడాలనుకుంటున్నారు. నిర్ణయం జాసన్  చేతిలోనే ఉందని విజయ్ చెప్పడంతో,  ఆయన అభిప్రాయం ఎలా తెలుస్తుందా? ఆ సమయం ఎప్పుడు వస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు.

ఇక రెండు మూడు సినిమాలు మాత్రమే చేసిన లోకేశ్ కనగరాజ్ కి ఛాన్స్ ఇచ్చి 'మాస్టర్' తో సంచలన విజయాన్ని అందుకున్న విజయ్, అంతే అనుభవమున్న నెల్సన్ చేతిలో ఇంత భారీ ప్రాజెక్టు పెట్టాడు. ఈ సినిమాతో మరో సంచలనానికి తెర తీస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News