ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో కిరణ్ అబ్బవరం. కెరీర్ తొలి నాళ్ల నుంచి విభిన్నమైన కథలని ఎంచుకుంటూ తనదైన ప్రత్యేకతని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రాజావారు రాణిగారు , ఎస్ ఆర్ కల్యాణ్ మండపం వంటి చిత్రాల్లో నటించి హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం వరుసగా నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి `సెబాస్టియన్ పీసి 524`. బాలీజీ సయ్యపరుడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. కోమలి ప్రసాద్, నువేక్ష హీరోయిన్ లుగా నటించారు. సిద్ధారెడ్డి, జయచంద్రరెడ్డి - రాజు - ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు.
చిన్నతనం నుంచి రేచీకటితో బాధపడే ఓ యువకుడిగా కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రేచీకటితో బాధపడే ఓ యువకుడికి కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. రాత్రి మాత్రమే డ్యూటీలుంటాయి. అలాంటి సమయంలో రేటీకటి వున్న హీరో ఎలా మ్యానేజ్ చేశాడు? .. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ చిత్ర ప్రధాన కథ. రేటీకటి వున్న యువకుడి పాత్రలో కిరణ్ అబ్బవరం నటించిన తీరు ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా సోమవారం విడుదల చేశారు.
ఉన్నట్టుండి విజయ్ దేవరకొండ ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయడానికి బలమైన కారణమే వుందని తెలిసింది. ఇటీవల `ఎస్. ఆర్ . కల్యాణ్ మండపం`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కిరణ్ అబ్బవరం `సెబాస్టియన్ పీసీ 524` విషయంలో చాలా కాన్షిడెంట్ గా వున్నాడట. అయితే తన కాన్ఫిడెన్స్ తగ్గట్టుగా సినిమాపై బజ్ లేకపోవడంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ని రంగంలోకి దింపారని, సినిమాపై బజ్ ని క్రియేట్ చేయడం కోసం ట్రైలర్ ని విజయ్ దేవరకొండ చేత రిలీజ్ చేయించారని తెలిసింది.
ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. రెండే రెండు చిత్రాలతో మార్కెట్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం నటిస్తున్న మూడవ చిత్రమిది. ఈ మూవీతో ఎలాగైన సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మార్చి 4న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కు రెడీ అవుతోంది.
విభిన్నమైన కథతో రూపొందిన ఈ చిత్రం కిరణ్ అబ్బవరం అంచనా ప్రకారం సక్సెస్ ని అందించి అతని కెరీర్ కి మరింత జోష్ ని అందిస్తుందేమో చూడాలి. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం `సెబాస్టియన్ 524` తో పాటు సమ్మతమే, నేను మీకు బాగాకావాలసిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాల్లో నటిస్తున్నాడు.