107వ‌ సినిమా షూట్ లో బాల‌య్య‌..స‌ర్జరీ లేం జ‌ర‌గ‌లేదు!

Update: 2022-04-26 05:31 GMT
నటసింహ బాలకృష్ణకి భుజానికి జ‌రిగిన స‌ర్జ‌రీ త‌ర్వాత తాజాగా  మరో సర్జరీ జరిగిందని.. కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతోన్న బాలయ్య మోకాలికి కేర్ ఆసుపత్రిలో వైద్యుల బృందం శస్ర్త చికిత్స నిర్వహించిన‌ట్లు సోష‌ల్ మీడియా క‌థ‌నాలు  వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇది మైనర్ సర్జరీనే అని..ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని డాక్టర్లు సూచించిన‌ట్లు.. బాలకృష్ణ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అభిమానులు ఎవ్వరూ కంగారు పడాల్సిన పనిలేదని డాక్టర్లు చెప్పిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

అలాగే బాల‌య్య కాలికి క‌ట్టుక‌ట్టిన ఫోటోలు..డాక్ట‌ర్ల బృందంతో దిగిన ఓ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. దీంతో బాల‌య్య ఆరోగ్యంపై అభిమానుల్లో  గంద‌ర‌గోళం  మొద‌లైంది. భుజానీకి స‌ర్జరీ జ‌రిగిన కొన్ని రోజులుగా మ‌ళ్లీ మోకాలికి స‌ర్జ‌రీ ఏంటి? అని అభిమానుల్లో కంగారు మొద‌లైంది. దీంతో అస‌లు బాల‌య్య ఆరోగ్యం వెనుక అస‌లేం  జ‌రుగుతుందంటూ మీడియా క‌థ‌నాలు హీటెక్కిస్తున్నాయి.  

అయితే ఇవ‌న్నీ అవాస్త‌వాల‌ని బాల‌కృష్ణ క్లారిటీ ఇచ్చారు. కేవ‌లం రెగ్యుల‌ర్ చెక‌ప్ ల కోస‌మే ఆసుప‌త్రికి వెళ్లిన‌ట్లు తెలిపారు. ద‌య‌చేసి ఎలాంటి అవాస్త‌వాలు ప్ర‌చురించ వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసారు. అలాగే బాల‌కృష్ణ నేడు త‌న 107వ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ సార‌థి స్టూడియోలో ' జ‌రుగుతంది.

నేటి ఉదయం బాల‌య్య య‌ధావిధిగా షూటింగ్ కి హాజ‌ర‌య్యారు. దీంతో అక్క‌డ నుంచి ఆయ‌న‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అవ్వ‌డంతోనే ఆయ‌న ఆరోగ్యంపై వ‌స్తోన్న క‌థ‌నాల‌న్ని గాలి వార్త‌ల‌ని తెలుస్తోంది.

ఈ చిత్రానిక గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. బాల‌య్య  ఇమేజ్ కి  ఏమాత్రం త‌గ్గ‌కుండా ప‌క్కా మాస్ గోపీ మార్క్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తోంది. అయితే వైర‌ల్ అవుతోన్న ఫోటో వెనుక క‌థ ఏంటి? అన్న‌ది ఇంకా క్లారిటీ దొర‌క‌లేదు.  పాత ఫోటో ఏదైనా మ‌ళ్లీ నెట్టింట వైర‌ల్ అవుతుంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News