టాలీవుడ్ లో వున్న స్టార్ హీరోల్లో అత్యధిక శాతం రీమేక్ లలో నటించని హీరో ఎవరైనా వున్నారా? అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే. ఇప్పటి వరకు ఎలాంటి రీమేక్ చిత్రాల్లో నటించని ఆయనకు ఓ సినిమా రీమేక్ చేస్తే అందులో నటించాలని వుందట. ఈ విషయాన్ని ఇటీవల `ఆర్ ఆర్ ఆర్` ప్రమోషన్స్ లో భాగంగా కీరవాణితో జరిపిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు ఎన్టీఆర్. స్టార్ హీరో ఎన్టీఆర్ రీమేక్ లపై స్పందించడం ఇదే తొలిసారి కావడంతో తాజా ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన ఆల్ టైమ్ హిట్స్ ని రీమేక్ చేసే అవకాశం వున్నా.. ఎన్టీఆర్ బయోపిక్ లో నటించమని అడిగినా తాత గారి చిత్రాలని ముట్టుకోనని, వాటిని రీమేక్ చేసే సహసం చేయనని చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ చెబుతూ వస్తున్నారు. ఆ మటపై ఇప్పటికీ కట్టుబడి వుంటున్నారు. అయితే తాజా గా మాత్రం ఓ రీమేక్ ని చేయాలని వుందని తన మనసులో మాటని బయటపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ. హిందీ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కోసం ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో ప్రారంభించేశారు. ఏ వేదిక, ఏ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ని కూడా వదల కుండా సినిమా ప్రమోషన్స్ కోసం వాడేస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ మూవీకి సంగీతం అందించిన ఎం.ఎం. కీరవాణితో కలిసి ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రత్యేక చిట్ చాట్ లో పాల్గొన్నారు. అయితే ఈ చిట్ చాట్ లో భాగంగటా కీరవాణి అడిగిన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్ తన మరనసులోని మాటని బయటపెట్టేశారు.
ఎన్టీఆర్ తనకు తన తండ్రి హరికృష్ణ నటించిన `సీతయ్య` చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేయాలని వుందని, ఆ చిత్రానికి మీరు అందించిన సంగీతం హైలైట్ అని ప్రశంసలు కురిపించిన ఎన్టీఆర్ వీలైతే `సీతయ్య` చిత్రాన్ని రీమేక్ చేయాలని వుందని చెప్పేశాడు.
నేటి పరిస్థితులుకు అనుగుణంగా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తే ఈ మూవీని రీమేక్ చేయాలని వుందన్నాడు. అంటే కాకుండా సినిమాలోని ఇంటెన్సిటీ, హీరో క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా వుంటాయని తెలిపాడు. ఇందులో హరికృష్ణ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఎవరి మాటా వినడు సీతయ్య అంటూ హల్ చల్ చేసిన ఈ చిత్రానికి వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.