ప్రేరణతో విక్రమాదిత్య లవ్ స్టోరీ ఎలా ఉండనుందో ఆడియెన్ రాధేశ్యామ్ లో చూడబోతున్నారు. నిన్నటి సాయంత్రం ప్రివ్యూలతో ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ సందడి స్టార్ట్ కాగా.. నేటి ఉదయం నుంచి షోలు పడుతున్నాయి. సినిమా ఎలా ఉందో తెలియాలంటే.. మధ్యాహ్నానికి తుపాకీలో రివ్యూ చదివేయొచ్చు. అదంతా సరే కానీ.. ఇప్పటికీ ప్రభాస్ డార్లింగ్ ఇంటర్వ్యూలతో తన సినిమాని ప్రచారం చేస్తూనే ఉన్నారు.
అయితే ఈ ప్రచారంలో మాత్రం ఎక్కడా పూజా గురించి ప్రభాస్ ప్రస్థావించడం లేదు. అంతా కామ్ గా ఇతర విషయాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా రాజమౌళితో ఇంటర్వ్యూలోనూ ప్రభాస్ ఇలానే చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోతున్న ట్యాలెంటెడ్ పూజా గురించి ఎక్కడా హైలైట్ చేయలేదు. రాధే శ్యామ్ ని ప్రమోట్ చేయడానికి రాజమౌళి ప్రభాస్ తో చేసిన స్పెషల్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పూజా హెగ్డేపై ఏదైనా చెబుతాడేమోనని అంతా భావించినా కానీ అది జరగలేదు.
దీంతో ప్రేరణతో విక్రమాదిత్యునికి ఎక్కడ పొసగలేదు! అన్న గుసగుస మరోసారి మొదలైంది. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని.. లవ్ స్టోరీని చిత్రీకరించిన విధానం చాలా అద్భుతంగా ఉందని రాజమౌళి ప్రశంసించినందుకు ప్రభాస్ సంతోషించినా కానీ ప్రేరణ ప్రస్థావన మాత్రం అస్సలు తేలేదు. పైగా దర్శకుడు రాధా కృష్ణ పనితనం బావుందని కితాబిచ్చాడు. పూజా హెగ్డే గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యపరిచింది. అంటే కావాలనే డార్లింగ్ ఇలా చేస్తున్నాడా? అన్న సందేహం వ్యక్తమైంది.
ఈ చిట్ చాట్ లో ఎక్కువగా ఇతర విషయాలపైనే డార్లింగ్ ఎక్కువ ఫోకస్ చేశారు. చివరికి కంగనా రనౌత్ తో జ్యోతిష్య అనుభవం మొదలు మగధీర గురించి.. రాజమౌళి పాఠాల గురించి మాట్లాడారు తప్ప పూజా గురించి ప్రస్థావించలేదు. ఇక రాధేశ్యామ్ వరకూ వస్తే రాధాకృష్ణ గురించి పొగిడాడు. యువి సంస్థను ఆకాశానికెత్తేశాడు కానీ పూజానే ఎందుకని డార్లింగ్ లైట్ తీస్కున్నాడో అర్థం కానిది.
ఇటీవల ప్రమోషనల్ ఈవెంట్లో ప్రభాస్ చెంతనే కూచున్నా ఇద్దరి మధ్యా ఏమంత కెమిస్ట్రీ కనిపించడం లేదని అంతా భావించారు. ఇప్పుడు మళ్లీ ప్రూఫ్ దొరికింది. అప్పట్లోనే పూజాతో ప్రభాస్ కి గుస్సా నడుస్తోందన్న ప్రచారం సాగినా మధ్యలో పూజా ప్రమోషన్ కి రావడంతో అంతా సద్దుమణిగిందనే భావించారు. కానీ ఇప్పుడు మరోసారి ఇలా డౌట్ రాజేసారు డార్లింగ్.
ఆ పాటలో ప్రేరణతో కెమిస్ట్రీ అదుర్స్
బయట ఎలా ఉన్నా కానీ డార్లింగ్ కి పూజాతో ఆ సాంగ్ లో కెమిస్ట్రీ అదుర్స్ అన్న కితాబు అందుతోంది. రాధే శ్యామ్ పాట మెయిన్ ఇష్క్ మే హూన్ ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ - పూజా హెగ్డేల ప్రణయ భూకంపానికి కారణమేంటో కనుగొనాలి అనిపించేంతటి ఉత్కంఠను ఈ పాటలో ఆవిష్కరించారు. విడుదలకు ముందు మెయిన్ ఇష్క్ మే హూన్ అనే కొత్త పాట విడుదల కాగా వైరల్ గా దూసుకెళుతోంది. ఈ మ్యూజికలో వీడియోలో ప్రభాస్ - పూజా హెగ్డే పాత్రలు ఆద్యంతం రక్తి కట్టించాయి. విక్రమాదిత్య- ప్రేరణల ప్రేమకథ ఈ పాటను చూశాక ఎంతో ఆసక్తిని పెంచింది. ప్రేమ వికాసంతో మొదలై చివరికి విధ్వంసానికి దారి తీస్తుంది.. అయితే దీనిని ముందే గ్రహిస్తాడు విక్రమాదిత్య. విక్రమాదిత్య చెప్పినట్లుగా భూకంపం లాంటి విపత్తే సంభవిస్తుందని అర్థమవుతోంది. హస్త సాముద్రిక నిపుణుడిగా ప్రభాస్ మరో లెవల్ నటన ప్రదర్శిస్తే అతడి ప్రేమికురాలిగా పూజా ఎంతో అందంగా ఒదిగిపోయింది. మూవీ ఎలా ఉందో సమీక్ష కోసం తుపాకీని అనుసరించండి.