కేజీఎఫ్ సినిమా తో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు. దేశ వ్యాప్తంగా సినిమా ను భారీ ఎత్తున ప్రమోట్ చేయడం ద్వారా భారీ వసూళ్లను టార్గెట్ చేశాడు. కేజీఎఫ్ కు పది రెట్ల యాక్షన్ సన్నివేశాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ మరియు ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెబుతున్నాడు.
కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు కరోనా అడ్డు రావడంతో.. ఆ గ్యాప్ లో ప్రభాస్ తో సలార్ సినిమా ను ప్రశాంత్ నీల్ మొదలు పెట్టాడు. ఇప్పటికే 30 శాతం వరకు షూటింగ్ పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. సలార్ లో కూడా యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలను తలపిస్తాయి అంటూ మేకర్స్ బల్ల గుద్ది మరీ చెబుతున్న నేపథ్యంలో అభిమానుల్లో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ ఎలా అయితే కేజీఎఫ్ ను రెండు భాగాలుగా చేశాడో అలాగే సలార్ ను కూడా రెండు పార్ట్ లుగా చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేశాయి. ప్రస్తుతం మీడియాలో కూడా ఆ విషయమై జోరుగా ప్రచారం జరగడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా మీడియా ముందు సీక్వెల్ విషయమై క్లారిటీ ఇచ్చాడు. సలార్ 2 సినిమా ఉద్దేశ్యం పై స్పష్టంగా చెప్పుకొచ్చాడు.
కేజీఎఫ్ 2 ప్రమోషన్ కార్యక్రమంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. సలార్ సినిమా కథకు సీక్వెల్ అవసరం లేదని.. ఆ కథ విషయంలో అసలు సీక్వెల్ కు అవకాశం లేదని.. ఏదో మార్కెట్ కోసం లేదా వసూళ్ల కోసం రెండు పార్ట్ లుగా సలార్ ను చేయాలనే ఉద్దేశ్యం ప్రస్తుతానికి తనకు లేదని చెప్పుకొచ్చాడు. కథను లాగి తీయడం ద్వారా ప్రేక్షకుల నుండి విమర్శలు తప్ప మరేం లేదు అనేది కూడా ఆయన అభిప్రాయం.
రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం తో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా 'సలార్' సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సలార్ సినిమా తో తన స్టార్ డమ్ ను నిరూపించుకుంటాడని ప్రభాస్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే సలార్ ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉంది.
కాని కరోనా మరియు ఇతరత్రా కారణాల వల్ల ఇప్పటి వరకు కేజీఎఫ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు.. అది ఎప్పుడు వస్తుందో అనే క్లారిటీ కూడా లేదు. ప్రభాస్ సలార్ తో పాటు ఆదిపురుష్.. ప్రాజెక్ట్ కే మరియు స్పిరిట్ చిత్రాల్లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ల తేదీల విషయంలో స్పష్టత రాలేదు కదా.. కనీసం వీటి రిలీజ్ ఆర్డర్ కూడా తెలియడం లేదు.