#RRR : మెగా నందమూరి ఫ్యాన్స్ కు ఆ టెన్షన్‌ అక్కర్లేదు

Update: 2022-03-09 06:32 GMT
ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ లు హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 25వ తారీకున ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. బాహుబలి సినిమా సాధించిన విజయాన్ని జనాలు ఇంకా మర్చి పోలేదు. దాంతో రాజమౌళి దర్శకత్వంలో సినిమా అనగానే ఆర్‌ ఆర్‌ ఆర్‌ పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. కనుక సినిమా ను అదే స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

ఈనెల 25వ తారీకున సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాని ప్రమోషన్‌ కార్యక్రమాలు మాత్రం షురూ చేయలేదు. దాంతో మెగా మరియు నందమూరి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇంత భారీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కనీసం నెల రోజుల ముందు అయినా చేయాలి. కాని ఎందుకు జక్కన్న ఇంకా కూడా సినిమా ప్రమోషన్ ను మొదలు పెట్టడం లేదు.. ఈసారి అయినా విడుదల ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అభిమానుల ఆందోళనలో అర్థం ఉంది. కాని అది జక్కన్న సినిమా.. అది కాకుండా భారీ మల్టీ స్టారర్‌ మూవీ.. గతంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేశారు. కనుక కేవలం రెండు వారాల ప్రమోషన్స్ తో సినిమా స్థాయిని మళ్లీ లేపే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

కనుక ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాను పబ్లిసిటీ చేయడం ద్వారా ఆ సినిమాకు ఏమైనా డ్యామేజీ ఉండే అవకాశం ఉందని జక్కన్న భావిస్తున్నాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి ఏ ఉద్దేశ్యంతో సినిమా ను విడులకు రెండు వారాల ముందు ప్రమోట్‌ చేయాలని భావిస్తున్నాడో కాని.. ఆయన వారం ముందు సినిమా పబ్లిసిటీ చేసినా కూడా ఖచ్చితంగా భారీ విజయాలను దక్కించుకోవడం ఖాయం.. ఓపెనింగ్స్ తోనే రచ్చ చేయడం ఖాయం అంటూ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమా కు పబ్లిసిటీ ప్రారంభం కాలేదు అంటూ కొందరు అనుకుంటున్నారు.

కాని అసలు విషయం ఏంటీ అంటే సినిమా ను ప్రకటిస్తూ రాజమౌళి ఆ ఫోటో ను షేర్ చేసిన రోజు నుండే పబ్లిసిటీ మొదలు అయ్యింది. ఈ నాలుగు ఏళ్ల కాలంగా సినిమా గురించి వందలు.. వేల కొద్ది వార్తలు వస్తూ జనాల్లో ఆసక్తి పెరిగింది. కనుక ఇంకా ప్రత్యేకంగా ప్రచారం అక్కర్లేదు. అయినా కూడా జక్కన్న ఈనెల 14 నుండి పబ్లిసిటీ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. కనుక మెగా నందమూరి అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.


Tags:    

Similar News