RRR తో రావిపూడి చిట్ చాట్.. తనని 'బండ' అని పిలుస్తారని చెప్పిన తారక్..!
యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా "ఆర్.ఆర్.ఆర్". దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించారు. అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ కీలక పాత్రలు పోషించారు.
అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఆధారంగా ఫిక్షనల్ స్టోరీతో ఈ మల్టీస్టారర్ రూపొందింది. ఇందులో రామరాజుగా చరణ్.. భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది.
కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన ఈ RRR చిత్రాన్ని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది జక్కన్న టీం. రిలీజ్ కు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉండటంతో స్పెషల్ ఇంటర్వ్యూలతో సందడి చేస్తోంది.
RRR ప్రమోషన్స్ లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా భాగం అయ్యారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ - రాజమౌళితో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఫన్నీ చిట్ చాట్ చేశారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోని మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో వదిలారు.
'ఆర్.ఆర్.ఆర్' విశేషాలతో అనిల్ రావిపూడి సినిమాల మాదిరిగా ఫన్ రైడ్ తరహాలో సాగిన ఈ ఇంటర్వ్యూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. పనిలో పనిగా అనిల్ 'ఎఫ్ 3' చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవడం నవ్వు తెప్పిస్తుంది. ఇందులో రియల్ లైఫ్ లో క్రాకర్ వంటి తారక్ ను నీరుతో.. చరణ్ ను నిప్పుకు ప్రతీకగా చూపించడానికి గల కారణాన్ని రాజమౌళి వివరించారు.
సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఒక్కసారి కూడా ఒకరి పాత్ర మరొకరు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించలేదని RRR హీరోలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో వీరి మధ్య జరిగిన ఆహ్లాదకరమైన కన్వర్జేషన్ నవ్వులు పూయిస్తోంది.
ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా కష్టమైందని రాంచరణ్ అన్నారు. సమ్మర్ లో కరోనా కారణంగా ఆగిపోయిన వాటర్ సీక్వెన్స్ ని.. వింటర్ సీజన్ లో తెల్లవారుజామున 4 గంటలకు చేయించి తనను జక్కన్న టార్చర్ చేసారని తారక్ ఫన్నీగా చెప్పారు.
'సినిమాలో మీకు హీరోయిన్ ఉన్నట్టేనా?' అని అనిల్ రావిపూడి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ చెప్పిన జవాబు చిత్రంగా ఉంది. 'అదే తెలియడం లేదు బ్రదర్. ఉండీ లేనట్టుగా.. నాదా కాదా అన్నట్టుగా.. అసలు నాకు హీరోయిన్ ను పెట్టారా లేదా అన్నట్టుగా ఏదో విచిత్రంగా ఉంది. అది నాకే అర్థం కాలేదు' అంటూ తారక్ నవ్వించారు.
'మూవీ ట్రైలర్ లో ఒలీవియాను చూపించారు కదా!' అని అనిల్ అన్నప్పుడు… 'అమ్మామెరుపుతీగా ఒక్కసారి వచ్చి వెళ్ళిపో' అన్నట్టుగా నా హీరోయిన్ అలా చూపించారు'అని ఎన్టీఆర్ చమత్కరించారు. సినిమాలో ఒకరి పాత్ర ఎక్కువ మరొకటి తక్కువ ఉండదని.. ఇద్దరు పాత్రలు బ్యాలన్స్ గా ఉంటాయని జక్కన్న తెలిపారు.
RRR అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి సినిమా కంప్లీట్ అయ్యే వరకు అనేక విశేషాలను ఈ వీడియోలో వెల్లడించారు. సినిమా ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే ఎన్టీఆర్ - రాం చరణ్ లను మర్చిపోయి.. కొమురం భీమ్ - అల్లూరి సీతారామరాజు లనే తెర మీద చూస్తారని తెలిపారు.
ఈ ఇంటర్వ్యూ ద్వారా రాజమౌళి సతీమణి రమా రాజమౌళి తనను 'బండ' అని పిలుస్తారనే విషయాన్ని ఎన్టీఆర్ వెల్లడించారు. ఇలా ఆసక్తికరమైన విషయాలతో అల్లరి మాటలతో సరదా సరదాగా సాగిన 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ తో అనిల్ రవిపూడి ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.
Full View