టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరమైన మంచు మోహన్ బాబు చాన్నాళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. 90వ దశకం వరకు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒక వెలుగు వెలిగిన మోహన్ బాబు.. గత రెండు దశాబ్దాల్లో చేసిన సినిమాలేవీ సరిగా ఆడక, అలాగే సినిమాలు తగ్గించేయడం తన మార్కెట్ మొత్తం కోల్పోయారు. చివరగా ‘గాయత్రి’ అనే చిత్రంలో లీడ్ రోల్ చేసిన ఆయనకు.. ఆ సినిమాతో చేదు అనుభవమే మిగిలింది. దీంతో మళ్లీ కెరీర్లో గ్యాప్ వచ్చింది.
ఇక మళ్లీ హీరోగా సినిమా చేయరేమో అనుకుంటే.. ‘సన్ ఆఫ్ ఇండియా’తో పునరాగమనానికి సిద్ధమయ్యారు. మంచు ఫ్యామిలీ సినిమాలు చాలా వాటికి రచయితగా పని చేసిన డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకుడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా దీనికి సంగీతం అందించారు. ప్రగ్యా జైశ్వాల్, సునీల్, పోసాని కృష్ణమురళి, ఆలీ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ.. మధ్యలో ఈ సినిమా వార్తల్లోనే లేదు. ఇప్పుడు ఉన్నట్లుండి దీన్ని విడుదలకు సిద్ధం చేశారు. మోహన్ బాబు ట్రాక్ రికార్డుకు తోడు.. ప్రమోషన్లు పెద్దగా లేకపోవడం వల్ల ‘సన్ ఆఫ్ ఇండియా’కు అంతగా బజ్ లేదు. ఆ విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కనీస స్థాయిలో కూడా బుకింగ్స్ లేకపోవడంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కూడా నడుస్తోంది.
ఈ సినిమా పట్ల జనాల వ్యతిరేకతకు వేరే కారణాలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఇంత నెగెటివిటీని తట్టుకుని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం.. సినిమాను విజయవంతం చేయడం మోహన్ బాబు సవాలే. ఈ ఛాలెంజ్‌ను ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి. ఈ సినిమా థియేటర్లలో ఏమాత్రం ఆడుతుందన్నది పక్కన పెడితే.. మంచి టాక్ అయినా వస్తే ఓటీటీల నుంచి మెరుగైన డీల్ రావచ్చు. చూడాలి పబ్లిక్ టాక్, రివ్యూలు ఎలా ఉంటాయో? ఈ వీకెండ్లో దీంతో పాటు ‘వర్జిన్ స్టోరీ’ అనే అడల్ట్ రేటెడ్ చిన్న సినిమా కూడా రిలీజవుతోంది.