ముంబై టాప్ మోడల్ మాళవిక శర్మ వృత్తిరీత్యా నటి.. ప్రవృత్తి రీత్యా లాయర్ అన్న సంగతి తెలిసిందే. ఇటీవల నటనపైనే పూర్తిగా దృష్టి సారించారు. 2018 లో రవితేజ నేల టికెట్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ లా విద్యార్థిని ఆ తర్వాతా సినిమాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల రామ్ సరసన రెడ్ లో కనిపించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి `ఆహా` ప్రమోషనల్ వీడియోలోనూ మాళవిక నటించారు.ప్రవృత్తి రీత్యా లాయర్ కాబట్టి ఆ వృత్తిని మాళవిక విడిచిపెట్టడం లేదు.
మాళవిక శర్మ హైదరాబాద్ హైకోర్టులో జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారని తాజాగా తెలుస్తోంది. 2020 నవంబర్ లో ముంబైలోని రిజ్వి లా కాలేజీ నుండి మాళవిక ఎల్.ఎల్.బిలో పట్టభద్రురాలయ్యారు. జనవరి 2021 లో మహారాష్ట్ర - గోవాలోని బార్ కౌన్సిల్ నుండి లైసెన్స్ పొందారు.
ముంబై విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.ఎమ్ లోనూ మాళవిక ప్రవేశం పొందారు. ఆమె ప్రవేశ పరీక్షను క్లియర్ చేసారని తెలిసింది. ప్రస్తుతం క్రిమినాలజీలో నైపుణ్యం పొందాలని భావిస్తున్నారు. లాయర్ ప్రవృత్తిని కొనసాగిస్తూనే టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టుల కోం మాళవిక ఆసక్తిగా వేచి చూస్తున్నారట. ఇటీవల వరుస ఫోటోషూట్లతో అభిమానుల ముందుకు వస్తున్నారు.
తాజాగా మాళవిక బటన్ లెస్ ఫోజ్ తో అగ్గి రాజేసింది. మిల్కీ వైట్ అందాలతో మెరుపులు మెరిపించే ఈ బ్యూటీ ఇన్నర్ షో హాట్ టాపిక్ గా మారింది. అలా రెడ్ కలర్ డిజైనర్ ఫ్రాక్ పై కాంబినేషన్ కోట్ ని చేత్తో పట్టుకుని కనిపించింది. పాపులర్ వాచ్ బ్రాండ్ కి మాళవిక ప్రమోషన్ చేస్తున్న వైనం బయటపడుతోంది.