మెగాస్టార్ చిరంజీవి లైన్ లో పెట్టిన రీమేక్ సినిమాలలో మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' ఒకటి. మోహన్ లాల్ హీరోగా పృథ్విరాజ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో చిరు కోసం ఈ సినిమా రైట్స్ రామ్ చరణ్ తీసుకున్నారు. ముందుగా ఈ స్క్రిప్ట్ బాధ్యతలను 'సాహో' ఫేమ్ సుజిత్ చేతిలో పెట్టారు. కొన్ని రోజులు దీనిపై వర్క్ చేసిన యువ దర్శకుడు మధ్యలోనే తప్పుకున్నాడు. ఈ క్రమంలో మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ వచ్చి చేరాడు. కొన్ని నెలల పాటు తన టీమ్ తో కలసి ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు వినాయక్. అయితే స్క్రిప్టులో చేసిన మార్పులపై చిరంజీవి సంతృప్తి చెందలేదు. దీంతో ఒకానొక దశలో అసలు ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ఉంటుందా లేదా అని టాక్ నడిచింది.
అలాంటి సమయంలో తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ మెగా రీమేక్ తెరకెక్కనున్నట్లు ప్రకటించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి.. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్తామని వెల్లడించారు. అయితే నిజానికి మోహన్ రాజా తన బృందంతో కలసి రెడీ చేసిన స్క్రిప్ట్ కూడా చిరంజీవి ని మెప్పించలేకపోయిందట. దీంతో లేటెస్టుగా సక్సెస్ అందుకున్న ఓ రైటర్ ని కూర్చోబెట్టి, సరికొత్త స్క్రిప్టు రెడీ చేయించారట. అయితే దీంట్లో కూడా మెగాస్టార్ పలు మార్పులు సూచించడంతో.. దర్శకుడు మళ్ళీ స్క్రిప్ట్ పై వర్క్ చేయాల్సి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. రీమేక్ స్క్రిప్ట్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి రెడీ చేయడానికి ఏమి ఇబ్బందులు వస్తున్నాయో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇకపోతే 'ఆచార్య' షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 'లూసిఫర్' రీమేక్ ని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరికొన్ని వారాల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో కీలక పాత్రలో కనిపించనుంది. అది మలయాళంలో మంజు వారియర్ పోషించిన పాత్ర అని తెలుస్తోంది. నయనతార తన పాత్రకు సంబంధించిన షూటింగ్ సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారని సమాచారం. చిరంజీవి కెరీర్ లో వస్తున్న 153వ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూర్చనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ - ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.