సంక్రాంతి అంటేనే సంథింగ్ స్పెషల్. పందెం పుంజులు దూసుకొస్తాయి. అయితే ఈసారి సంక్రాంతి పెందెం ఎలా ఉండబోతోంది? అన్నదానిపై చాలా అడ్వాన్స్ డ్ గా చర్చ సాగుతోంది. సంక్రాంతి 2023కి ఇప్పటికే ముగ్గురు అగ్ర హీరోలు వస్తున్నారని ఖాయమైంది. పోటీ హోరాహోరీగా ఉండనుందని సన్నివేశం చెబుతోంది. రాబోవు సంక్రాంతికి భారీ బెట్టింగ్ నడవనుంది.
వచ్చే2023 సంక్రాంతికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన `ఆదిపురుష్` విడుదలవుతుందని ఒక రోజు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 13 జనవరి 2023న విడుదలవుతుందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఇది రామాయణం నేపథ్యంలో 3డి సినిమా కావడంతో బోలెడంత హైప్ నెలకొంది. ప్రభాస్ ఇందులో శ్రీరాముడిగా కనిపిస్తుండగా సైఫ్ ఖాన్ రావణుడిగా కనిపిస్తారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే రామ్ చరణ్ - శంకర్‌ల కాంబినేషన్ చిత్రం RC 15 కూడా సంక్రాంతి బరిలోనే విడుదలవుతుంది. రిలీజ్ తేదీని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే వెల్లడించారు. ఇది 2.0 తర్వాత మళ్లీ అలాంటి అసాధారణ బడ్జెట్ తో తెరకెక్కుతుండడంతో అందరి చూపు దీనిపైనే ఉంది. చరణ్ ఇందులో కలెక్టర్ కం ముఖ్యమంత్రిగా కనిపిస్తారని టాక్. కియరా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది.
మరోవైపు తారక్- కొరటాల శివల చిత్రం కూడా 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అంటే పరిశ్రమ అగ్ర హీరోలు చరణ్- ప్రభాస్ - తారక్ .. ముగ్గురు ఇప్పటికే 2023 సంక్రాంతిని లాక్ చేశారని అర్థమవుతోంది.
అయితే ఈ చిత్రాలన్నీ చాలా కాలంగా ఎదురుచూస్తున్నవి..అభిమానుల్లో భారీ అంచనాలు హైప్ ఉన్నవి. ఏదేమైనా 2023 సంక్రాంతి ట్రీట్ చాలా స్పెషల్ గా ఉంటుందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏ సినిమాకి వెళ్లాలో ప్రేక్షకులు ఎంచుకోవాల్సిన సన్నివేశం ఉంటుంది.
అయితే అంత పెద్ద హీరోల నడుమ క్లాష్ బాక్సాఫీస్ వద్ద అంత మంచిది కాదు కాబట్టి గ్యాప్ మెయింటెయిన్ చేసే వీలుంటుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేయాలంటే ఒకేరోజు కాకుండా చిన్నపాటి గ్యాప్ తో రావాల్సి ఉంటుంది. జనవరి 5 నుంచి జనవరి 15 లోపు ఈ మూడు తేదీలు ఉంటాయని కూడా భావించవచ్చు.