బాహుబలి.. సాహో మరియు రాధేశ్యామ్ ఈ మూడు సినిమాలకు కూడా ప్రభాస్ దాదాపుగా పది సంవత్సరాల సమయం తీసుకున్నాడు. జక్కన్న సినిమా అంటే అంత సమయం తీసుకుంది. ఇతర సినిమాలకు ప్రభాస్ మరీ అంత సమయం కేటాయించడం ఏంటీ అంటూ అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ డమ్ ఉన్న ప్రభాస్ వరుస సినిమాలు చేస్తే సినిమా ఇండస్ట్రీకి మరియు అభిమానులకు ఫిల్మ్ మేకర్స్ ఇలా అన్ని క్రాప్ట్ లకు వారికి మంచి జరుగుతుంది.
కాని ప్రభాస్ రెండు మూడు ఏళ్లకు ఒక సినిమా చొప్పున విడుదల చేస్తే ఎలా అంటూ అభిమానులు ఆగ్రహంతో ఉన్న సమయంలో తన స్పీడ్ పెంచాడు. మొదటి గేర్ నుండి ఏకంగా నాలుగు.. అయిదు గేర్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల జాబిత చూస్తుంటే అభిమానులకు కడుపు నిండి పోతుంది అనడంలో సందేహం లేదు. రాధేశ్యామ్ ను మొదలుకుని వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలను ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
ప్రభాస్ ఈ ఏడాదిలో రాధేశ్యామ్ సినిమా తో పాటు మారుతి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ను కూడా విడుదల చేయబోతున్నాడట. రాధేశ్యామ్ సినిమా ఈ నెలలోనే విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఆ వెంటనే మారుతి దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. కేవలం రెండు నెలల్లోనే సినిమాను ముగిస్తానంటూ ప్రభాస్ కి మారుతి హామీ ఇచ్చాడట. దాంతో వెంటనే డేట్లు ఇచ్చేందుకు ప్రభాస్ ఒప్పుకున్నాడు.
మారుతి దర్శకత్వంలో దానయ్య నిర్మించబోతున్న సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. 2022 సంవత్సరంలో ప్రభాస్ నుండి రాధేశ్యామ్ మరియు రాజా డీలక్స్ లు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యాయి. ఇక 2023 సంవత్సరం ఆరంభంలో బాలీవుడ్ 3డి మూవీ అయిన ఆదిపురుష్ తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి అయినా కూడా గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అవుతున్నాయట.
2023 లో రాబోతున్న మరో సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల షూటింగ్ సక్రమంగా జరగలేదు. అంతే కాకుండా ప్రశాంత్ నీల్ సినిమా కేజీఎఫ్ 2 విడుదలకు సిద్దంగా ఉంది. కనుక ఆ పనుల్లో దర్శకుడు ఉన్నాడు. కనుక సలార్ ను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేస్తారనే సమాచారం అందుతోంది.
2023 లో ఆదిపురుష్ మరియు సలార్ లు విడుదల కాబోతుండగా 2024 లో ప్రాజెక్ట్ కే మరియు స్పిరిట్ సినిమాలు వస్తాయని అంటున్నారు. ఏడాదికి రెండు చొప్పున ప్రభాస్ ఇకపై బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపడం ఖాయం. పరిస్థితులు అనుకూలించి అభిమానుల అదృష్టం ఫలిస్తే ఏడాదికి రెండే కాదు మూడు కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ప్రభాస్ సినిమాల జోరు ఇండియన్ బాక్సాఫీస్ ను రాబోయే అయిదు ఏళ్ల పాటు షేక్ చేయడం ఖాయం అనిపిస్తుంది.