టాప్ హీరో హీరోయిన్ల నుంచి ఆఫర్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్లంతా ఓటీటీ ని ఆశ్రయిస్తున్నారు. ఎలాగైనా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలని.. తెర ఏదైనా.. నటనకు బ్రేక్ పడ కూడదని డిజిటల్ తెరపై అడుగుపెడుతున్నారు. వెబ్‌సిరీస్‌లలో తమ సత్తా చాటుతున్నారు. రొమాన్స్, లవ్, క్రైమ్, థ్రిల్లర్, హారర్.. ఇలా జానర్ ఏదైనా తమ జోష్ చూపిస్తున్నారు. ఇప్పుడీ బాటలోనే టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి వెళ్తోంది. త్వరలోనే ఆమె ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది.
తమన్నా.. కాజల్.. నివేదా పేతురాజ్.. ఇప్పుడు లావణ్యా త్రిపాఠి.. ఇలా హీరోయిన్లంతా ఒక్కొక్కరుగా ఓటీటీ బాట పడుతున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా.. ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేయాలని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా తమ సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు.
సినిమాల్లో అవకాశాలు తగ్గి ఇబ్బంది పడుతున్న వారు కూడా ఓటీటీ లను అవకాశంగా మలుచుకుని మళ్లీ వెండితెరను ఏలడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పడు ఈ లిస్ట్‌లో సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి కూడా చేరింది.
దశాబ్ద కాలంగా టాలీవుడ్లో తన గ్లామర్‌తో.. నటనతో.. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న లావణ్య.. కొంతకాలంగా సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నారు. చావు కబురు చల్లగా తర్వాత లావణ్య ఖాతాలో అంతగా చెప్పుకోదగిన పాత్రలేమి లేవు. అందుకే ఈ భామ ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఓటీటీ వైపు మళ్ళింది.
పులి-మేక అనే వెబ్ సిరీస్ చేసేందుకు లావణ్య త్రిపాఠి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ సిరీస్‌కు కోన్ వెంకట్ కథ అందించగా.. చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు ఈయన గోపీచంద్ నటించిన పంతం సినిమాకు డైరెక్టర్‌గా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసులను టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకర్ని వరుసగా హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ కథే పులి-మేక. థ్రిల్లర్ అంశాలకు జాతకాల్ని కూడా మిక్స్ చేసి రాసిన డిఫరెంట్ స్టోరీ అని కోన వెంకట్ చెప్పారు.
ఇదే వెబ్ సిరీస్‌తో హీరో ఆది సాయికుమార్ కూడా ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో సీనియర్ నటుడు సుమన్ కూడా నటిస్తున్నారు. అయితే పులి-మేకలో పులి-మేక ఎవరనేది తెరపైనే చూడాలి. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం హ్యాపీ బర్త్ డే అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమె చేతిలో మరే ప్రాజెక్టూ లేదు. ఇప్పుడు ఆమె ఆశలన్నీ పులి-మేక పైనే. త్వరలోనే దీని షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పులి-మేక టీమ్ వెల్లడించింది.