మామూలుగా ఒక షాప్ ఓపెనింగ్ కోసం ఒక హీరోయిన్ ను పిలిస్తే.. ఎంతో కొంత ఖచ్చితంగా సమర్పించుకోవాల్సిందే. శారీ దుకాణాల వారు.. ఎక్కువగా శ్రీయ ను పిలుస్తుంటారు. ఎందుకంటే ఆమె తక్కువ రేటులో విచ్చేసే స్టార్ హీరోయిన్. 6-8 లక్షలు తీసుకొని రిబ్బన్ కటింగ్ చేసిపెడుతుంది. ఒకప్పుడు జెనీలియా 10 లక్షలు లాగేసి రికార్డు సృష్టించింది. ఆ తరువాత సమంత కూడా అదే రేంజులో తీసుకుందిలే. ఇప్పుడు రకుల్ - రెజీనా - రాశి ఖన్నాలు కూడా 10 నుండి 15 లకారాల వరకు అడుగుతున్నారు. అయితే వీళ్లందరూ స్టార్ డమ్ సంపాదించిన హీరోయిన్లు. అందుకే 15 అయినా ఓకె. మరి అందాల రాక్షసి పరిస్థితి ఏంటి?
తొలి సినిమాతో ఏదో పేరొచ్చింది కాని.. లావణ్య త్రిపాఠి ని అసలు టాలీవుడ్ లో పట్టించుకున్న నాదుడే లేడు. తరువాత మంచు విష్ణుతో ఓ సినిమా చేసినా బ్రేక్ రాలేదు. అప్పట్లో ఇలాంటి రిబ్బన్ కటింగులంటే అమ్మడు 3-4 ల్యాక్స్ అనేదట. కాని ఇప్పుడు వరుసగా భలే భలే మగాడివోయ్ - సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలు హిట్టయిపోయాయ్. దానితో అమ్మడి డిమాండ్ పెరిగింది. మనకు తెలుస్తున్న సమాచారం బట్టి చూస్తే.. అమ్మడు ఏకంగా ఒక ప్రముఖ బట్టల దుకాణం వారికి 20 లక్షలు కోట్ చేసిందట. ఏకంగా రిబ్బన్ కటింగుకే అంత ఎమౌంటా? ఆ లెక్కన చూస్తే సినిమాలు చేయడం కంటే.. ఈ షాపులు తెరుచుకుంటూ కంటిన్యూ అయితేనే ఎక్కువ డబ్బులొస్తాయేమో.