మెగాస్టార్ చిరంజీవి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను సైరా నరసింహారెడ్డి చిత్రంలో చేశాడు. నేడు భారీ అంచనాల నడుమ సైరా నరసింహారెడ్డి విడుదలైంది. రామ్ చరణ్ సైరాను దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు అంటూ వార్తలు వస్తున్నాయి. సురేందర్ రెడ్డి సైరా చిత్రంకు దర్శకత్వం వహించాడు. చిరంజీవి డ్రీమ్ రోల్ ఫుల్ ఫిల్ అయినట్లేనా అంటే కాదని ఆయన డ్రీమ్ రోల్ అలాగే మిగిలి ఉందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. చిరంజీవి చాలా కాలంగా భగత్ సింగ్ పాత్రలో నటించాలని కోరుకుంటున్నాడు.
ఇటీవల సైరా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ చాలా కాలంగా ఎదురు చూసిన ఉయ్యాలవాడ పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చరణ్ నా డ్రీమ్ రోల్ ను నెరవేర్చాడంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో తన మరో డ్రీమ్ రోల్ అయిన భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ ఇక నావల్ల కాదని.. మళ్లీ అలాంటి పాత్రలు సినిమాలు చేయలేక పోవచ్చు అంటూ తేల్చి చెప్పాడు. నేను చేయాలనుకున్న భగత్ సింగ్ పాత్రను చరణ్ చేస్తూ చూడాలని ఆశగా ఉందని చిరు చెప్పుకొచ్చాడు.
చిరంజీవి సైరా నరసింహారెడ్డికి మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో విమర్శల కంటే ప్రశంసలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దాదాపు అన్ని రివ్యూలు కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. దాంతో మెగా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. చిరు తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. వచ్చే నెలలో సినిమా ప్రారంభం అయ్యి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.