వివాదాలకు కేంద్రంగా ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు లీగల్ నోటీసులు అందాయి. అయితే.. ఈ నోటీసులు రాజకీయమైనవో.. మరొకటో కాదు. కంగనా తీయబోయే నెక్సట్ సినిమాకు సంబంధించినవి!
కంగనా రనౌత్ తన గత మూవీ మణికర్ణి చిత్రానికి సీక్వెల్ తీయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. 'మణికర్ణిక.. ది లెజెండ్ ఆఫ్ దిద్దా' పేరుతో కాశ్మీరీ రాణి జీవితగాథను తెరకెక్కించాలని సిద్ధమైంది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఆశిష్ కౌల్ అనే వ్యక్తి లీగల్ నోటీసులు పంపారు.
ఇంతకీ ఆశిష్ కౌల్ ఎవరు? అంటే.. ఈయన ఓ రచయిత. కాశ్మీరీ రాణి జీవితగాథను 'దిద్దా.. కాశ్మీర్ కీ యోధా రాణి' పేరుతో పుస్తక రూపంలో ప్రచురించాడు. 2017లో ఈ పుస్తకం ఇంగ్లీష్ వెర్షన్ కూడా విడుదలైంది. కాశ్మీర్ రాణి దిద్దా జీవితగాథకు సంబంధించి ఆశిష్ కౌల్ హక్కులను కలిగి ఉన్నాడు.
తన పర్మిషన్ లేకుండా దిద్దా జీవిత చరిత్రను కంగనా రనౌత్ సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నారనేదది ఆశిష్ వాదన. ఈ మేరకు కంగనాకు నోటీసులు పంపాడు. మరి ఈ లీగల్ నోటీసులపై కంగనా అండ్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.