తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ అరుల్ ఇటీవల లెజెండ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన విషయం తెల్సిందే. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే తన యాడ్స్ తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ లెజెండ్ స్టార్ మరోసారి అందరిని సర్ ప్రైజ్ చేశాడు.
శరవణన్ మొదటి సినిమా లెజెండ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ ముద్దుగుమ్మలను నటింపజేసి పాన్ ఇండియా రేంజ్ సినిమా అంటూ సౌత్ తో పాటు నార్త్ లో కూడా లెజెండ్ ను విడుదల చేసిన శరవణన్ మినిమం కలెక్షన్స్ ను రాబట్టలేక పోయిన విషయం తెల్సిందే.
ఆ సినిమాలో శరవణన్ లుక్ విషయంలో కూడా విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయిదు పదుల వయసు దాటిన తాత గారికి ఇలాంటి లెజెండ్ వేషాలు అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. లుక్ విషయంలో విమర్శలు చేసిన వారంతా కూడా నోరు వెళ్లబెట్టే విధంగా శరవణన్ తన కొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి షాక్ ఇచ్చాడు.
తన కొత్త సినిమా కోసం విభిన్నమైన మేకోవర్ తో యూత్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. సింపుల్ గడ్డం మరియు మీసాలతో శరవణన్ లుక్ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి శరవణన్ రెండో సినిమా ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ త్వరలోనే మరో సినిమా తో ఈ స్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.