గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయి వారి కెరీర్ లని మలుపు తిప్పిన క్రేజీ బ్లాక్ బస్టర్లని వారి పుట్టిన రోజు కానుకలుగా రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ హంగామా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ `పోకిరి`తో మొదలైంది. అప్పటి నుంచి ఇది లాభ సాటిగా మారడంతో స్టార్ ల బర్త్ డే స్పెషల్స్ గా రిలీజ్ చేస్తున్న రీరిలీజ్ లు కాస్తా ఏ సినిమా అనుకూలంగా దొరికితే ఆ సినిమాని రీ రిలీజ్ చేసేదాకా వచ్చేసింది.
ఇప్పటికే మహేష్ కు సంబంధించిన పలు సినిమాలని రీ రిలీజ్ చేశారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ జల్సా, ఖుషీ లని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ నటించిన వర్షం, రెబల్ వంటి సినిమాలని కూడా సమయం సందర్భం లేకుండా కేవలం ఫ్యాన్స్ అందించే వసూళ్ల కోసం రీ రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మహేష్ నటించిన మరో సినిమా `ఒక్కడు`ని రీ రిలీజ్ చేశారు. జనవరి 7న ఈ మూవీని విడుదల చేస్తే థియేటర్లలో మహేష్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత ఓ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `ఒక్కడు` నా కెరీర్ లో ఓ అందమైన జ్ఞాపకమని చెప్పారు. అంతే కాకుండా ఈ సినిమాని మహేష్ తో ఎందుకు చేయాలనిపించిందో, దీనికి అంకురార్పణ ఎలా జరిగిందో వెల్లడించారు. మహేష్ నటించిన `మురారి` సినిమాలోని క్లైమాక్స్ లో మహేష్ ప్రదర్శించిన నటన ఎం.ఎస్. రాజుని ఎంతగానో ఆకట్టుకుందట. అది నచ్చడంతో తనతో సినిమా చేయాలని వెళ్లి కథ వినిపించారట.
అయితే అది ఒక్కడు స్టోరీ కాదని, మనసంతా నువ్వే అని తెలిపారు ఎం.ఎస్ రాజు. అయితే మహేష్ తో `మనసంతా నువ్వే` కథ చేయడం తనకు నచ్చక ఎం.ఎస్. రాజు డైలమాలో వుండగా ఒక రోజు మహేష్ ఫోన్ చేసి గుణశేఖర్ ఓ కథ చెప్పాలనుకుంటున్నారు. ఒకసారి వినండి అన్నాడట. ఆ సమయంలో గుణ్ శేఖర్ `మృగరాజు` ఫ్లాప్ లో వున్నారు. అదే సమయంలో ఎం.ఎస్. రాజు `దేవి పుత్రుడు`తో ఫ్లాప్ ని ఎదుర్కొన్నారు. ఇద్దరం ఫ్లాప్ లో వున్నాం కాబట్టి ఇద్దరం ఒకసారి కలిస్తే బెటర్ అని కలిశారట. కలిసిన వెంటనే గుణశేఖర్ అరగంటలో కథ చెప్పారట. అదే `ఒక్కడు`.
అయితే ఈ స్టోరీ అప్పుడున్న పరిస్థితులకు భారీ బడ్జెట్ అవుతుందని, ఇప్పటికే ఇద్దరు నిర్మాతలకు కథ వినిపించామని, మీరు ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు చేస్తే బెటరో ఆలోచించి.. ఇద్దరు కలిసి చర్చించాక ఫైనల్ గా ముందు వెళ్లాలంటే నేను రెడీ అని మహేష్ అన్నారట. అంతే కాకుండా చార్మినార్ ఇండులో ప్రధాన భూమిక పోషిస్తుంది కాబట్టి ఉదయాన్నే 5 నుంచి 7 గంటల వరకు నేరుగా చార్మినార్ దగ్గరికే వచ్చేస్తానని, అక్కడ సీన్స్ షూట్ చేసుకున్నాక మిగతా షూటింగ్ చేసుకుందామని మహేష్ చెప్పారట. అయితే అదే సమయంలో ఎం.ఎస్. రాజు తీసిన `మనసంతా నువ్వే` బ్లాక్ బస్టర్ హిట్ కావడం లాభాల్ని అందించడంతో సెట్ కే వెళదామని చెప్పారట.. అలా `ఒక్కడు` సినిమా పట్టలలెక్కిందని చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.