సినీ తారలు కొందరు తళుక్కున మెరుస్తారు. అంతలోనే మాయమవుతారు. కట్ చేస్తే.. మళ్లీ కొంతకాలానికి తెర మీదకు వస్తారు. అలా వచ్చి వెళ్లిపోయి.. మళ్లీ వచ్చిన వారెందరో. అయితే.. ఇప్పుడు చెప్పే మహలక్ష్మీ అలియాస్ మోహిని రూటు కాస్త సపరేటు. చేసింది కొన్ని సినిమాలే అయినా.. తన అందంతో.. విలక్షణమైన కళ్లతో ఆమె చేసిన మేజిక్.. అప్పటి ప్రేక్షకుల్ని చక్కిలిగింతలు పెట్టటమే కాదు.. వారి మనసుల్ని దోచేసింది. వివిధ భాషల్లో వందకు పైగా సినిమాలు చేసిన ఆమె.. గడిచిన కొద్దికాలంగా కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? లాంటి విషయాల్ని వెల్లడించారు.
మోహిని అన్నంతనే.. చూసేందుకు కాస్త జయప్రద.. మరికాస్త సైరాభానులా ఉందనే వారట. ఈ కారణంతోనే అవకాశాలు కూడా వచ్చాయి. పదమూడేళ్ల వయసులో తొలిసారి సినిమా అవకాశం వచ్చింది. డ్యాన్స్ చేస్తున్న ఫోటోల్ని చూసి ఆమెకు అవకాశం ఇచ్చారు. కానీ.. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఏడాది తర్వాత మళ్లీ మొదలైంది. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే వచ్చింది సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఆదిత్య 369. బాలయ్య చేసిన సినిమాల్లో రోటీన్ కు భిన్నంగా ఉండే మూవీగా దీన్ని చెప్పాలి.
ఈ సినిమా టైంకు ఆమె మహలక్ష్మీ పేరుతో ఉండేవారు. అయితే.. అప్పటికే లక్ష్మీ.. శ్రీలక్ష్మీ పేర్లతో ఆర్టిస్టులు ఉండటంతో మరో కొత్త పేరుతో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని భావించారట. అప్పట్లో తేజాబ్ సినిమా విడుదలై సూపర్ హిట్ కావటం.. అందులో మాధురీ దీక్షిత్ పోషించిన పాత్ర పేరు మోహిని. అందుకే.. ఆ పేరును పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకు ఓకే చెప్పటంతో.. మహలక్ష్మీ కాస్తా మోహినిగా మారిపోయిందని చెబుతారు.
1991లో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె 1999 నాటికి వందకు పైగా సినిమాల్లో నటించారు. అదే సమయంలో ఆమెకు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు చేయొద్దని షరతు పెట్టలేదట. నిజానికి పెళ్లి తర్వాత కూడా పది సినిమాలు చేసిందట. కొన్ని సీరియల్స్ లో కూడా నటించిందట. పెళ్లి తర్వాత ప్రెగ్నెంట్ కావటం.. ఆపై వచ్చిన అనారోగ్య సమస్యలతో అమెరికాకు వెళ్లిపోయారట. ఇప్పుడు చెన్నైలో ఉంటున్న ఆమె.. మళ్లీ అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధమంటోంది. మరి.. ఆమె మాటలకు ఎన్ని ఆఫర్లు వస్తాయో చూడాలి.