సరిలేరు కాంబినేషన్‌ పూర్తిగా సైడ్‌ అయినట్లేనా?

Update: 2021-04-15 05:30 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. దాంతో ఆ చిత్ర దర్శకుడు అనీల్‌ రావిపూడితో మరో సినిమాను చేసేందుకు మహేష్‌ బాబు ఆసక్తి చూపిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తప్పకుండా మహేష్‌ బాబుతో మరో సినిమాను చేస్తానంటూ అనీల్‌ కూడా చాలా నమ్మకంతో ఉన్నాడు. ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమాను వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ లతో తెరకెక్కిస్తున్న అనీల్‌ రావిపూడి తన తదుపరి సినిమాను మహేష్‌ బాబుతో చేయబోతున్నట్లుగా చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు.

మహేష్‌ బాబు ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం అనీల్‌ రావిపూడి సినిమా ఉంటుందనుకున్న వారికి షాక్‌ ఇచ్చేలా కొత్త ప్రకటన రాబోతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ 30 సినిమాను క్యాన్సిల్‌ చేసుకున్న త్రివిక్రమ్‌ తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మే 31న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమా ఇది అనే విషయం తెల్సిందే.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాకు మహేష్‌ బాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో అనీల్‌ రావిపూడి మరో హీరోను వెదుక్కోవాల్సి వచ్చింది. అయితే అనీల్‌ రావిపూడి ప్రాజెక్ట్‌ ను మహేష్‌ బాబు పూర్తిగా సైడ్‌ చేసినట్లేనా అంటే ఖచ్చితంగా కాదు అంటున్నారు. ప్రస్తుతానికి కాకున్నా భవిష్యత్తులో అయినా అనీల్‌ తో సినిమాను చేసేందుకు మహేష్‌ బాబు సిద్దంగా ఉంటాడని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. త్రివిక్రమ్‌ తో మూవీ తర్వాత రాజమౌళితో మహేష్‌ బాబు మూవీ ఉండే అవకాశం ఉంది. జక్కన్నతో సినిమా తర్వాత అనీల్‌ కు మహేష్‌ ఏమైనా ఆఫర్‌ ఇస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News