మెగా సెంటిమెంట్ మహేష్ కు వర్తిస్తుందా ?

Update: 2019-03-07 06:44 GMT
నిన్న మహర్షి వాయిదా గురించి దిల్ రాజు ప్రెస్ మీట్ లో చెప్పిన డేట్ సెంటిమెంట్ గురించి మెగా ఫ్యాన్స్ లో కూడా చర్చ మొదలైంది. కారణం మే 9 జగదేకేవీరుడు అతిలోకసుందరి రిలీజ్ డేట్ కాబట్టి ఆ రకంగా దాని నిర్మాతైన అశ్విని దత్ ఇందులో కూడా పార్ట్ నర్ కాబట్టి ఆ రకంగా కలిసి వస్తుందని దిల్ రాజు చెప్పారు. అంతే కాదు గత ఏడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన మహానటి వచ్చింది కూడా మే 9నే . అయితే దాన్ని నిర్మించింది ఆయన కాదు. దత్తు గారి పిల్లలు. సరే ముందుండి నడిపించారు కాబట్టి ఆయన ఎకౌంటులోనే వేద్దాం.

కాని మహర్షి దత్తు గారికి సోలో ప్రొడ్యూసర్ మూవీ కాదు. తను ఒక భాగానికే ప్రతినిధి. దిల్ రాజుతో పాటు పివిపి ప్రసాద్ కూడా ఉన్నారు. అసలు ఈ ఇద్దరూ ఇప్పటి దాకా మహర్షికి సంబంధించిన ఏ ప్రెస్ మీట్ లోనూ కనిపించలేదు. అంతా దిల్ రాజు మయమైపోయింది. ఇదలా ఉంచితే మెగా స్టార్ మే 9 సెంటిమెంట్ మహేష్ కు ఎలా వర్తిస్తుంది అనేదే మెగా ఫ్యాన్స్ ప్రశ్న

పైగా మహేష్ సినిమాలు మేలో పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. వాళ్ళు వీటినే ఉదాహరణలుగా చూపుతున్నారు. దిల్ రాజు చెప్పిన నెలల సెంటిమెంట్ కరెక్ట్ అయితే మహేష్ వి కూడా ప్రస్తావించాలి కదా అనేదే వాళ్ళ ప్రశ్న. ఇవన్ని ఏదో అనుకోవడానికి బాగుంటాయి కాని ఇక్కడ ఫైనల్ గా సినిమాలో మ్యాటర్ ముఖ్యం.

నెలలను బట్టి సినిమాల జాతకం ఆధారపడి ఉంటుంది అనుకుంటే పోకిరి-శ్రీమంతుడు-ఒక్కడు ఎప్పుడు వచ్చాయో ఆ నెలలే ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడో లాజిక్ మర్చిపోకూడదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు జనవరిలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాని మరో జనవరిలో వచ్చిన 1 నేనొక్కడినే చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఇక్కడ రిజల్ట్ ని నిర్దేశించింది కంటెంట్ కాని నెల కాదుగా. ఏదో కవర్ చేయాలనీ దిల్ రాజు చెప్పినవే కాని మహర్షిలో నిజంగా విషయం ఉంటే మాత్రం ఎవరు చెప్పినా ఆపినా ఆడి తీరుతుంది.
Tags:    

Similar News