ఏపీ సీఎంకి విషెష్ చెప్పిన మహేష్ బాబు !

Update: 2019-12-21 11:01 GMT
ఈ రోజు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన 47 వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కి ఎంతోమంది సినీ , రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. దేశ ప్రధాని మోడీ , పలువురు కేంద్ర మంత్రులు కూడా సీఎం జగన్ కి బర్త్ డే విషెష్ తెలియజేసారు.

తాజాగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు , సూపర్ స్టార్ మహేష్ బాబు సీఎం జగన్‌ కు బర్త్‌ డే విషెస్ తెలియజేసారు. మన గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అని మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన విషెష్ ని తెలిపారు.  

ఇకపోతే  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ తరుణంలోనే  వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లాలో 47 కేజీల భారీ కేక్‌ ను కట్‌ చేశారు.
Tags:    

Similar News