జెనీలియా ఫుడ్ ఐటమ్స్ కి మహేశ్ బాబు ఫిదా!

Update: 2021-11-18 05:14 GMT
బాలీవుడ్ సినిమాలు చూసేవారికి రితేష్ దేశ్ ముఖ్ పరిచయమే. ఇక జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరమే లేదు. తెలుగు తెరపై ఆమె చేసిన అల్లరిని .. సందడిని ఇక్కడివారు ఇంకా మరిచిపోలేదు.

తెలుగులో జెనీలియా చేసినవి తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే సినిమాలు చేసింది. 'సై' .. 'హ్యాపీ' .. 'బొమ్మరిల్లు' .. 'ఢీ' సినిమాలు ఆమెకి విజయాలతో పాటు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అయితే వివాహమైన తరువాత ఆమె తెలుగు సినిమాల వైపు రాలేదు. కానీ ఇక్కడి హీరోలందరితో ఆమెకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.

జెనీలియా దంపతులు ఈ మధ్య 'ఇమేజిన్ మీట్స్' అనే పేరుతో ఒక ఫుడ్ బిజినెస్ ను భారీ స్థాయిలోనే స్టార్ట్ చేశారు. ఆ ఫుడ్ బిజినెస్ ప్రమోషన్స్ లో ఇద్దరూ కూడా బిజీగానే ఉన్నారు. ఇక తాము స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్న సెలబ్రిటీలకు తమ ఫుడ్ ఐటమ్స్ ను పంపిస్తున్నారు.

అలా కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ నుంచి ఫుడ్ ఐటమ్స్ చాలామంది సినిమా ప్రముఖులకు వెళుతున్నాయి. అలాగే జెనీలియా దంపతుల నుంచి మహేశ్ బాబుకు ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి. దాంతో మహేశ్ బాబు వెంటనే తన ఇన్ స్టా ద్వారా స్పందించాడు.

'ఇమేజిన్ మీట్స్' ప్యాకేజ్ .. వారి ఇమేజ్ తనని బాగా ఇంప్రెస్ చేశాయనీ, వాటిని ఎప్పుడు టేస్ట్ చేయాలా అనే ఆత్రుతతో ఉన్నానని చెప్పాడు. వాటిని టేస్ట్ చేయకుండా వెయిట్ చేయడం తనవల్ల కాదంటూ రాసుకొచ్చాడు. తన పట్ల అభిమానంతో పంపించినందుకు థ్యాంక్స్ చెబుతూనే, వాళ్ల ఫుడ్ ప్రొడక్స్ట్ పట్ల ఆసక్తిని వ్యక్తం చేశాడు.

ఇక జెనీలియా దంపతులు చాలా సింపుల్ గా తమ ప్రోడక్ట్ ను టాలీవుడ్ కి కూడా పరిచయం చేశారనే చెప్పాలి. ఇక ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏయే స్టార్స్ ను పలకరిస్తాయో చూడాలి.

ఇక మహేశ్ బాబు విషయానికి వస్తే .. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'సర్కారువారి పాట' రెడీ అవుతోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్త్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. ఇంతవరకూ దుబాయ్ .. గోవా .. స్పెయిన్ లలో ఈ సినిమా షూటింగును పూర్తి చేశారు.

కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాత త్రివిక్రమ్ తో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'మహర్షి' వచ్చిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News