ఫ్యాన్స్ కోసం మహర్షి పాట్లు

Update: 2019-03-09 10:58 GMT
స్టార్ హీరోలతో వచ్చిన చిక్కు ఒకటే. విడుదల తేదీ విషయంలో మాటకు కట్టుబడి నిలబడకపోతే ఫ్యాన్స్ మహా ఫీలైపోతారు. పైగా పదే పదే డేట్లు మార్చడం నెగటివ్ గా సైతం అనుకుంటారు. ఇలా ప్రతిసారి జరుగుతుందని కాదు కానీ ఒక్కసారి వాళ్ళ మైండ్ లో ఓ తేదీ అనుకుంటే అది మారడానికి వాళ్ళ మనసు ససేమిరా ఒప్పుకోదు. ఇలాంటి పరిస్థితుల్లో మహర్షికి మూడో డేట్ వచ్చింది. ఏప్రిల్ 5 నుంచి 25 ఆపై మే 9న ఫైనల్ గా లాక్ చేసుకుంది.

సరే పైకి ఎవరు ఏమి అన్నా అనకపోయినా ఇలా జరగడం అభిమానుల్లో కొంత అసంతృప్తి కలిగించిన మాట వాస్తవం. దిల్ రాజు ఏదో సెంటిమెంట్ లెక్కలు చెప్పాడు కానీ మహేష్ కి మే నెల కలిసిరాకపోవడమే వాళ్ళను ఎక్కువ టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు వీళ్ళను కూల్ చేయడం చాలా అవసరం. అందుకే ఇందాకా మహర్షి వర్కింగ్ స్టిల్స్ ని ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. అప్పుడే ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేశాయి

దీనికి కారణం చాలా స్పష్టం. డేట్ విషయంలో ఏర్పడిన అసంతృప్తిని చల్లారుస్తూ సెంటిమెంట్ల గురించి అభిమానులు ఎక్కువ ఆలోచించకుండా ఉండేందుకే ఇప్పుడు మహర్షి వర్కింగ్ స్టిల్స్ వదిలినట్టు తెలుస్తోంది. వీటి బదులు మరో పోస్టరో చిన్న టీజరో వదిలితే బాగుండేది కానీ సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలు టైం ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా ప్లాన్ చేస్తున్నారు.

 దానికి తోడు బజ్ ఏ మాత్రం తగ్గకుండా మైంటైన్ చేసేందుకు ఇలాంటి స్టిల్స్ హెల్ప్ అవుతాయి, మొత్తానికి మహర్షి టీమ్ ఎత్తుగడ బాగానే ఉంది.. ఇంకా రెండు నెలల టైం ఉంది కాబట్టి అభిమానులు వీటి ద్వారా కొత్త ఊరట చెందుతారు. ఏదేమైనా ఫ్యాన్స్ ని చల్లార్చడం కోసం మహర్షి పడుతున్న పాట్లు ఎలా ఉన్నా పిక్స్ మాత్రం పండగ చేసుకునేలాగే ఉన్నాయి
Tags:    

Similar News