సూపర్ స్టార్ కృష్ణ భార్య...మహేష్ తల్లి ఇందిరా దేవి స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీవడియా వేదికగా ప్రముఖలంతా సంతాపం తెలియజేస్తున్నారు. ఇందిరా దేవితో సాన్నిహిత్యం ఉన్న వారంతో భౌతిక ఖాయానికి నివాళులు అర్పిస్తూ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక అభిమానులైతే విషాదంలో మునిగిపోయారు.
'స్టే స్ర్టాంగ్' అంటూ సోషల్ మీడియా వేదికగా మహేష్ కి ధైర్యం చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే అన్నయ్య రమేష్ బాబు ని కోల్పోయిన దుఖం నుంచి మహేష్ కోలుకుంటోన్న సమయంలో ఇంతలో తల్లిని కూడా కోల్పోవడంతో మహేష్ శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా అభిమానులు గతంలో మహేష్ తల్లి గురించి మాట్లాడిన వీడియోల్ని తీసి షేర్ చేస్తున్నారు.
'అమ్మ అంటే దేవుడితో సమానం. ఏ సినిమా చేసినా ఆ సినిమా రెండు..మూడు రోజుల్లో రిలీజ్ అవుతుందంటే చాలా ఒత్తికిడి గురవుతాను .టెన్షన్ పడతాను. అప్పుడు మరో ఆలోచన లేకుండా అమ్మ దగ్గరికి వెళ్లిపోతాను. ఆమె చేత్తో కాపీ కలిపి ఇస్తుంది.
ఆ కాపీ అన్ని రకాల టెన్షన్స్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఆ కాపీ నాకు దేవుడి గుడిలో ప్రసాదంతో సమానం. అమ్మ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి' అని గతంలో చాలాసార్లు చెప్పుకొచ్చారు.
ఇప్పుడా వీడియోలు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి. అమ్మతో మహేష్ అనుబంధం అంటూ టైటిల్స్ పెట్టి షేర్ చేస్తున్నారు. అమ్మ గురించి చెప్పమంటే మహేష్ సమయం మర్చిపోయి ఎంత సేపైనా మాట్లాడుతూనే ఉంటారు. ఇందిరా దేవి మహేష్ నటించిన కొన్ని సినిమా ఈవెంట్లకు రేర్ గా హాజరయ్యేవారు.
అయితే వయోభారంతో కొంత కాలంగా పూర్తిగా దూరమయ్యారు. ఇంటికే పరిమితమయ్యారు. సమయం దొరికినప్పడల్లా మహేష్ భార్యా పిల్లలతో కలిసి అమ్మ ఇంటికెళ్లే వారు. ముఖ్యంగా సితార పొలిక మహేష్ తల్లినే అచ్చంగా పొలి ఉంటుంది. సితారని చూస్తుంటే తన తల్లే గుర్తొస్తుందని మహేష్ చాలా సందర్భాల్లో అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View