మహేష్ వాటికి చెక్ పెడతాడా?

Update: 2019-02-24 07:55 GMT
గత రెండు రోజులుగా మహర్షి వాయిదాకు సంబంధించిన పుకార్లతో మహేష్ ఫ్యాన్స్ తెగ వర్రీ అవుతున్నారు. ఏప్రిల్ 5 నుంచి 25 షిఫ్ట్ చేసాక ఇక ఏ మార్పు ఉండదు అనే నమ్మకం వాళ్ళలో బలంగా ఉంది. స్వయానా దిల్ రాజు చెప్పిన మాట కాబట్టి వేరే అభిప్రాయం పెట్టుకోవడానికి లేదు. అయితే ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ తప్పదని వస్తున్న కథనాలతో ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే మహర్షి ఏప్రిల్ 25కు తేవడం అంత ఈజీ కాదని ఇన్ సైడ్ టాక్.

దానికి తోడు మహేష్ ఈ మధ్య కాలంలో ఎఏంబి సినిమాస్ తో పాటు ఇతరత్రా బిజినెస్ వ్యవహారాలు డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ లో పెట్టుబడులు పెట్టడం గురించి చాలా బిజీగా గడుపుతూ ఉండటం వల్ల మహర్షి షూటింగ్ అనుకున్నంత సజావుగా జరగడం లేదని ఫిలిం నగర్ టాక్. దర్శకుడు వంశీ పైడిపల్లి మరోపక్క డబ్బింగ్ మొదలు పెట్టినా ఇంకా చాలా వర్క్ పెండింగ్ లో ఉందని సమాచారం

ఇదంతా కొలిక్కి వచ్చి ఖచ్చితమైన డేట్ ప్రకటించడానికి కొంత టైం పడుతుంది. ఒకవేళ 25 ఫిక్స్ అనుకుంటే ఆ మాటను మరొక్క సారి అఫీషియల్ గా ప్రకటించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. గందరగోళానికి తెరపడుతుంది. అయితే మహర్షి యూనిట్ నుంచి అలాంటి సూచనలు ఏమి లేవు. ఆలస్యం అయ్యేకొద్ది బడ్జెట్ పెరుగుతుంది. అసలే ముగ్గురు నిర్మాతల మధ్య వ్యవహారం. బిజినెస్ తో పాటు మార్కెటింగ్ లాంటివి చాలా ఉంటాయి కాబట్టి అంత సులభంగా ఉండదు. అసలు ఈ కన్ఫ్యూజన్ లేకుండా మహేష్ లేదా దిల్ రాజు ఎవరో ఒకరు సైలెన్స్ ని బ్రేక్ చేసి మహర్షి అప్ డేట్ ఇస్తే తప్ప ప్రిన్స్ ఫ్యాన్స్ కుదుటపడేలా లేరు
Tags:    

Similar News