'శ్రీ‌మంతుడు -2' తీస్తున్నాడా?

Update: 2019-01-17 07:44 GMT
లావైపోకుండా ఉండాలంటే కొంతైనా వెన‌క్కి ఇచ్చేయాల‌ని శ్రీ‌మంతుడు చెప్పిన మాట‌ను అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. శ్రీ‌మంతుడి ఫార్ములా గ్రాండ్ స‌క్సెసైంది. ఇప్పుడు అదే ఫార్ములాతో మ‌హ‌ర్షి చిత్రం తెర‌కెక్కిస్తున్నారా?  శ్రీమంతుడు సీక్వెల్ క‌థ‌తోనే ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారా? అంటే అవున‌నే అంటున్నారు.

హ‌ర్ష..ఓ మిలియ‌నీర్ కొడుకు. చుట్టూ ప‌నివాళ్లు... ల‌గ్జ‌రీ లైఫ్..  అంతూ ద‌రీ లేని సంప‌ద‌..ఇలా అన్నీ వున్నా ఏదో తెలియ‌ని వెలితి. ఆ వెలితిని త‌రిమేయాల‌నుకునే క్ర‌మంలో అత‌నికి క‌నిపించిన అందం చారుశీల‌. త‌నని ఇంప్రెస్ చేయ‌డం కోసం హ‌ర్ష ప‌ల్లెబాట ప‌ట్ట‌డం.. అక్క‌డికి వెళ్లి ఆ ఊరిని ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేయాల‌నుకోవ‌డం... అది అక్క‌డి విల‌న్ బ్యాచ్‌ కు న‌చ్చ‌క‌పోవ‌డంతో వారితో హ‌ర్ష కు వైరం ముద‌ర‌డం..త‌రువాత ప‌రిణామాల్లో వారికి బుద్ధి చెప్పిన హ‌ర్ష ఎలా ఊరిని వారి బారినుంచి కాపాడాడు. ఎలా క‌థ‌ని సుఖాంతం చేశాడ‌న్న‌ది 2015లో వ‌చ్చిన `శ్రీ‌మంతుడు` స్టోరీ.

ఇదే స్టోరీకి  సీక్వెల్ త‌ర‌హాలోనే `మ‌హ‌ర్షి` క‌థాంశం ఉంటుంద‌న్న ముచ్చ‌టా సాగుతోంది. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `మ‌హ‌ర్షి` చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ఎంచుకున్న క‌థాంశంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అశ్వ‌నీద‌త్‌ - దిల్‌ రాజు - పీవీపీ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్రలో న‌టిస్తున్నాడు. సినిమాలో మ‌హేష్‌ కు స్నేహితుడిగా న‌రేష్ క‌నిపిస్తాడ‌ని - అత‌ని కోస‌మే త‌న‌కున్న ఆస్తుల‌న్నీ వ‌దులుకుని మ‌హేష్ గ్రామానికి వ‌స్తాడ‌ని - అక్క‌డున్న పేద‌రికాన్ని - మ‌నుషుల‌ను చూసి చ‌లించిపోయి `శ్రీ‌మంతుడు` త‌ర‌హాలోనే అభివృద్ధి చేయ‌డం మొద‌లుపెడ‌తాడ‌ట‌. ఈ క్ర‌మంలో విల‌న్ బ్యాచ్ రోటీన్‌ గా అడ్డుత‌గ‌ల‌డం - వారికి మ‌హేష్ బుద్ధి చెప్ప‌డం అటుపై క‌థేంటో తెర‌పై చూడాల్సిందేన‌ట‌. ఈ రోజు నుంచి ఈ చిత్ర ఫైన‌ల్ షెడ్యూల్ పొల్లాచ్చీలో జ‌ర‌గ‌బోతోంది. ఇక్క‌డే న‌రేష్ కు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ని చిత్రీక‌ర‌ణ జ‌రుప‌బోతున్నారు. ఈ స‌న్నివేశాలే సినిమాకు ఆయుపు పట్టని  చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ స‌న్నివేశాలే మ‌ళ్లీ `శ్రీ‌మంతుడు` చిత్రాన్ని గుర్తు చేయ‌నుండ‌టం కూడా చిత్ర యూనిట్ ను క‌ల‌వ‌ర‌పెడుతున్నా నిర్మాత‌ల్లో ఎవ‌రూ వెన‌క్కు త‌గ్గ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.


Full View

Tags:    

Similar News