టాలీవుడ్ లో కొన్ని ఫ్యామిలీస్ దశాబ్దాలుగా ఇండస్టీని ఏలుతున్నాయి. వారి వారసులు కూడా పరిశ్రమలో తమ ఉనికిని బలంగా చాటుకుంటూ వసతున్నారు. అలాంటి ఫ్యామిలీస్ లో నందమూరి వారిది ఒకటైతే, ఘట్టమనేని వారిది మరోటి. ఎన్టీయార్ కి క్రిష్ణకు మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉంది.
నిజానికి ఎన్టీయార్ సీతారామ కళ్యాణం మూవీ ద్వారానే ఇండస్ట్రీకి క్రిష్ణ పరిచయం కావాలి. అయితే అప్పటికి క్రిష్ణ చిన్నవాడు కావడంతో చదువుకుని రమ్మని ఎన్టీయార్ సలహా ఇచ్చారుట. ఆ తరువాత తేనే మనసులు మూవీ ద్వారా క్రిష్ణ సినీ రంగ ప్రవేశం చేశారు. ఇక ఎన్టీయార్ తో క్రిష్ణ అయిదు సినిమాలు చేస్తే అన్నింట్లోనూ తమ్ముడుగానే నటించారు.
క్రిష్ణ సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా నిర్మించిన సూపర్ డూపర్ హిట్ మూవీ దేవుడు చేసిన మనుషులు మూవీలో ఎన్టీయార్ నటించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక వీరిద్దరూ నటించిన చివరి సినిమా 1981లో వచ్చిన వయ్యారి భామలు, వగలమారి భర్తలు.
ఆ తరువాత ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. క్రిష్ణ కాంగ్రెస్ లో చేరి ఎన్టీయార్ కి యాంటీగా మూవీస్ తీసినా వారి వ్యక్తిగత బంధం మాత్రం అలాగే కొనసాగింది. ఇక ఎన్టీయార్ వారసుడు బాలక్రిష్ణతో కూడా క్రిష్ణ సుల్తాన్ అనే మూవీలో నటించారు. ఇది 1999లో రిలీజ్ అయి ఒక మోస్తర్ విజయం సాధించింది.
ఇపుడు టాలీవుడ్ లో ప్రచారంలో ఉన్న ఒక క్రేజీ న్యూస్ ఏంటి అంటే బాలక్రిష్ణ మహేష్ బాబు కలసి ఒక సినిమా చేస్తారని. నిజానికి ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. బాలయ్యను పవర్ ఫుల్ ఎనర్జీ బ్యాంక్ అంటూ మహేష్ బాబు ఏనాడో కితాబు ఇచ్చారు. బాలయ్య ఇప్పటిదాకామల్టీస్టారర్స్ ఏవీ చేయలేదు.
అయితే మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ మధ్యన బాలయ్యతో మహేష్ మూవీ ఉంటుందని ప్రచారం జరిగినా అందులో నిజం లేదని తేలిపోయింది. కానీ ఇపుడు మాత్రం దాని మీద గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.
అన్నీ కుదిరితే వచ్చే ఏడాది బాలక్రిష్ణ మహేష్ బాబు మూవీ సెట్స్ మీదకు రావచ్చు అంటున్నారు. దానికి కొరటాల శివ డైరెక్షన్ చేస్తారని కూడా తెలుస్తోంది. పక్కా మాస్ బాలయ్య, క్లాస్ విత్ మాస్ టచ్ మహేష్ బాబు కాంబోలో వచ్చే మూవీ ఎలా ఉంటుంది అన్న ఇంటెరెస్ట్ అయితే అందరిలో ఉంది.
అయితే కొరటాల లాంటి ఇంటలిజెంట్ డైరెక్టర్ కనుక ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తే అద్భుతమైన సబ్జెక్ట్ తోనే జనాల ముందుకు వస్తుంది అని అంటున్నారు. మొత్తానికి నందమూరి ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలు కలసి చేస్తే చూసే అవకాశం ఈ తరానికి దక్కబోతోంది అంటున్నారు.