మ‌హేష్-బ‌న్ని పంచాయ‌తీ.. మెగా కోర్టు లో?

Update: 2019-11-16 09:32 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా న‌టిస్తున్న `అల వైకుంఠ‌పుర‌ము లో` సంక్రాంతి కానుక‌ గా రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. రెండు చిత్రాలు జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. రిలీజ్ తేదీ తో పోస్ట‌ర్లు వేసి ఇరు వైపులా టీమ్ లు ఆ విష‌యాన్ని అధికారికం గాను వెల్ల‌డించాయి. అయితే రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున వ‌స్తే బాక్సాఫీస్ వ‌ద్ద ఇబ్బందుల‌తో పాటు.. థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్తుతుంద‌న్న‌ది తెలిసిందే. ఈ రెండు విష‌యాల‌పై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ర‌క‌ ర‌కాల క‌థ‌నాలు తెర‌ పైకి వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యం లో ఎవ‌రికి వారు వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నార‌ట‌. అనుకున్న‌దే శాస‌నంగా రిలీజ్ తేదీ మార్చ‌లేమ‌ని ప‌ట్టు బ‌ట్టార‌ని ఓ వార్త ఫిలిం న‌గ‌ర్ లో చ‌ర్చ‌కు దారి తీసింది. గ‌తం లోనూ ఇలాంటి స‌న్నివేశ‌మే ఆ ఇద్ద‌రు హీరోల మ‌ధ్య ఎదురైంది. కానీ అప్పుడు నిర్మాత‌లు ఒక‌రి తో ఒక‌రు మాట్లాడుకుని అండ‌ర్ స్టాండింగ్ కి రావ‌డం తో ఒక‌రు వెన‌క్కి త‌గ్గారు. దీంతో రిలీజ్ ప్ర‌శాంత వాతావ‌ర‌ణం లో జ‌రిగింది. కానీ ఈసారి మాత్రం నువ్వా నేనా? అంటూ వెన‌క్కి త‌గ్గేది లేదంటున్నార‌ట‌. అస‌లే సంక్రాంతి కావ‌డం తో ఏ హీరో వెన‌క్కి తగ్గ‌డం లేద‌ని సోష‌ల్ మీడియా లో ఇప్ప‌టికే క‌థ‌నాలు కుదిపేస్తున్నాయి. ఈ నేప‌థ్యం లో తాజాగా ఈ వ్య‌వ‌హారం మొత్తాన్ని మెగాస్టార్ చిరంజీవి చెవిన వేసార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌లే  చిరంజీవి అమెరికా ప‌ర్య‌ట‌న ముగించి హైద‌రాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఆ స‌మ‌యంలో చిరును రిసీవ్ చేసుకోడం కోసం ఆయ‌న‌ స‌న్నిహిత  నిర్మాత‌లు శంషాబాద్ ఎయిర్ పోర్టు కు వెళ్లారుట‌. ఆ టైమ్ లో  ఈ విష‌యం చిరు చెవిన వేసిన‌ట్లు వినిపిస్తోంది. దాస‌రి నారాయ‌ణ‌  రావు త‌ర్వాత ప‌రిశ్ర‌మ పెద్ద‌ గా ఆయ‌న‌ కే గౌర‌వం ద‌క్కుతోంది. `మా` వివాదం ప‌రిష్క‌రించ‌డం లోనే చిరు చొరవ తీసుకున్నారు. ఆ న‌మ్మ‌కంతోనే స‌ద‌రు నిర్మాతలు చిరు చెవిన ఈ విష‌యం వేసిన‌ట్లు ఓ రూమ‌ర్ వినిపిస్తోంది. అయితే మెగా కోర్టులో బ‌న్ని- మ‌హేష్ పంచాయితీ తేల్తుందా లేదా? అంటూ ఫ్యాన్స్ లో ముచ్చ‌ట సాగుతోంది. మ‌రో వైపు మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు జ‌న‌వ‌రి 11న అంటూ మ‌రో ప్ర‌చారం సాగుతోంది. బ‌న్ని కోసం ఒక‌  రోజు ముందుకు జరిగాడ‌న్న ప్ర‌చారం ఉంది. అయితే రెండు పెద్ద సినిమాలు భారీ అంచ‌నాల‌ తో వ‌స్తున్నాయి కాబ‌ట్టి ఆ ఒక్క‌రోజు ఎడం స‌రిపోద‌న్న భావ‌న ఉంది. మ‌రి ఈ మొత్తం వ్య‌వ‌హారం పై మెగా పంచాయితీ ఎలా సాగ‌నుందో చూడాలి.
Tags:    

Similar News