మహర్షి తాలూకు అప్ డేట్స్ ఎక్కువ లీక్ కాకుండా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది . షూటింగ్ ఒకపక్క నిర్విరామంగా జరుగుతున్నా ముందే ప్రకటించిన ఏప్రిల్ 5 విడుదల సాధ్యం కాదని తేలిపోవడంతో వాయిదా వేయక తప్పలేదు. అధికారిక ప్రకటనల ద్వారా చెప్పకపోయినా దిల్ రాజు నోటి వెంటే వచ్చింది కాబట్టి ఇంకే అనుమానాలు అక్కర్లేదు. అమెరికాలో కీలకమైన షెడ్యూల్ తర్వాత ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీలో వేసిన విలేజ్ సెట్ లో కొంత భాగం షూట్ చేసిన సంగతి తెలిసిందే.
సెకండ్ హాఫ్ లో వచ్చే ముఖ్యమైన ఘట్టాలన్నీ ఇందులోనే ఉంటాయట. పొలాచ్చిలో జరుగుతున్న పార్ట్ లో మహేష్ మొదటిసారి ట్రాక్టర్ తోలుతూ పొలం దున్నే రైతుగా సరికొత్తగా కనిపించబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇందుకుగాను దర్శకుడు వంశీ పైడిపల్లి 60 ట్రాక్టర్లు 30 నాగళ్ళతో భారీ సీక్వెన్స్ ప్లాన్ చేసాడట. ఓ ఫైట్ ఉండబోతోందని తెలిసింది. ఎక్కడో అమెరికాలో సీఈఓగా ఉన్న మహర్షి ఇండియాలోని మారుమూల పల్లెటూరికి వచ్చి పొలం దున్నాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలంటే మహర్షి వచ్చే దాకా ఆగాల్సిందే.
అయితే లీక్ అయిన లైన్ ప్రకారం అల్లరి నరేష్ కోసం మహేష్ ఇంత దూరం వచ్చి వ్యవసాయంలో కొత్త విప్లవం వచ్చేందుకు కృషి చేస్తాడట. అసలు నరేష్ కు వచ్చిన సమస్య ఏమిటో గ్రామ కక్షలు రాజకీయాలు మహర్షి లాంటి సున్నితమైన మనిషిని ఎలా రాటుదేలేలా చేశాయి లాంటి ప్రశ్నలకు సమాధానం వెండితెర మీద చూడాల్సిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మహర్షిలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. ఏప్రిల్ చివరి వారంవిడుదల అనే హింట్ ఇస్తున్నారు కానీ ఖచ్చితంగా మాత్రం చెప్పడం లేదు
Full View