సక్సెస్ ఫుల్ మ్యారేజ్ మహేష్ సీక్రెట్

Update: 2019-10-06 12:10 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ కవర్ పేజి కోసం ఫోటో షూట్ చేసిన సంగతి తెలిసిందే.  వోగ్ అక్టోబర్ ఎడిషన్ లో మహేష్ బాబు ఇంటర్వ్యూ కూడా ప్రచురితమైంది. ఈ ఇంటర్వ్యూలో మహేష్ ఎన్నో విషయాలను పంచుకున్నారు.  సినిమాల గురించే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మహేష్ మాట్లాడారు.

ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ కు మహేష్ ఉదాహరణలాగా కనిపిస్తారు.  మహేష్ వివాహమై ఇప్పటికి  14 ఏళ్ళయింది.  ఇప్పటికీ మహేష్ కు సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో ఒక వెకేషన్ కు ఎక్కడికైనా వెళ్తారు.  అందుకే మహేష్ ను మీ సక్సెస్ఫుల్ మ్యారేజ్ సీక్రెట్ ఏంటని ప్రశ్నిస్తే దానికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.  తను.. నమ్రత ఒకరికొకరు ఇచ్చుకునే స్పేస్.. ఇద్దరూ ఎలా ఉంటారో అలానే ఉండనివ్వడమే దానికి కారణమని వెల్లడించారు.  నిజమే.. ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు గౌరవించినప్పుడు ఇక అభిప్రాయభేదాలు ఎందుకు వస్తాయి? ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించడం సులువయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల వల్ల కుడా తల్లిదండ్రుల బంధం బలపడుతుందనే అభిప్రాయం మహేష్ వ్యక్తం చేశారు.

టాలీవుడ్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించే వారిలో మహేష్ - నమ్రత జంట ఒకటి.  14 ఏళ్ళు మాత్రమేకాదు.. కలకాలం ఇలానే ఉండాలని ఈ జెనరేషన్ వారికి  రోల్ మోడల్ కపుల్ గా ఉండాలని కోరుకుందాం.  ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నారు.  వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News