దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమాని తెరకెక్కించడానికి ఎంత కష్టపడతారో.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి అంతే శ్రమపడతారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం జక్కన్న అదే స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
RRR చిత్రాన్ని ముందుగా ఈ ఏడాది జనవరిలో విడుదల చేయాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ చేసి పాన్ ఇండియా వైడ్ సినిమాపై బజ్ తీసుకొచ్చారు. కానీ కరోనా పాండమిక్ పరిస్థితుల కారణంగా సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు మార్చి 25న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ ముమ్మరంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాలో అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల్లో నటించిన రామ్ చరణ్ - ఎన్టీఆర్ లను వెంటబెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు రాజమౌళి.
ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటుగా రెగ్యులర్ ప్రెస్ మీట్స్ మరియు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంతేకాదు 'ఆర్ఆర్ఆర్' ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాజమౌళి ఇప్పటికే కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలను రూపొందించి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
దర్శకుడు అనిల్ రావిపూడి - హీరో రానా దగ్గుబాటి - సంగీత దర్శకుడు కీరవాణి - యాంకర్ సుమ కనకాల లతో 'RRR' టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా జక్కన్న ఓ ఇంటర్వ్యూని ప్లాన్ చేయగా.. అది ఇప్పుడు క్యాన్సిల్ అయిందనే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
మహేష్ బాబుతో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు మంచి సాన్నిహిత్యం ఉంది. అలానే రాజమౌళికి కూడా మంచి అనుబంధం ఉంది. వీరి మధ్య బాండింగ్ ని దృష్టిలో పెట్టుకొని RRR తో మహేష్ స్వయంగా చిట్ చాట్ నిర్వహించే విధంగా ప్లాన్ చేశారట. కానీ ఇప్పుడు అది క్యాన్సిల్ అయినట్లు నివేదికలు చెప్తున్నాయి.
మహేష్ తో 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ ఇంటర్వ్యూ చేసి ఉంటే కచ్చితంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసేది. ఎలాగూ రాజమౌళి తన తదుపరి సినిమా సూపర్ స్టార్ తోనే చేస్తున్నారు కాబట్టి.. ఈ ఇంటర్వ్యూ సాధ్యమయ్యేదే. విడుదలకు ముందు కాకపోయినా.. రిలీజ్ తర్వాత అయినా అగ్ర హీరోలతో ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తే.. RRR సినిమా వసూళ్లకు పెద్ద బూస్ట్ లా పని చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.