కరోనా పాండమిక్ కారణంగా విడుదల వాయిదా పడిన సినిమాలన్నీ ఇప్పుడు థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద క్లాష్ అనేది అనివార్యమైంది. ఏవో ఒకటీ రెండు భారీ చిత్రాలకు తప్ప.. ప్రతీ వారం ఒక సినిమాకు పోటీగా మరో మూవీ ఉంటూనే ఉంది.
చిన్న మీడియా రేంజ్ సినిమాలు ఒకే వీకెండ్ లో రిలీజ్ అయితే పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ.. భారీ బడ్జెట్ చిత్రాలు - స్టార్ హీరోలు నటించిన సినిమాలు పోటీ పడితే మాత్రం వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అది నష్టాలకు దారి తీసే పరిస్థితి ఉంటుంది.
ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టిన ఏ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్న దాఖలాలు లేవు. ఏదో ఒక్క సినిమా మాత్రమే మంచి కలెక్షన్స్ అందుకొని సక్సెస్ అవుతోంది. అందుకే ఇప్పుడు క్లాష్ లేకుండా పెద్ద సినిమాలను రిలీజ్ చేయడమనేది నిర్మాతలకు సవాల్ గా మారింది.
కోవిడ్ వల్ల ఇన్నాళ్లుగా ఆగుతూ వచ్చిన భారీ సినిమాల వల్ల రోజులు గడిచే కొద్దీ బడ్జెట్ పెరుగుతూనే వస్తోంది. అందుకే పోటీ ఉంటుందని తెలిసినా.. ఏదొక డేట్ ని లాక్ చేసుకోక తప్పడం లేదు. ఈ క్రమంలో సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం.. ఆ తర్వాత మార్చడం.. మరో కొత్త రిలీజ్ డేట్ ఇవ్వడం.. ఇలా జరుగుతూనే ఉంది. ఈ సమ్మర్ సీజన్ చివర్లో మూడు పాన్ ఇండియా చిత్రాలు పోటీ పడటానికి రెడీ అయ్యాయి.
అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'మేజర్' సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ముందు అనుకున్న మే 27న కాకుండా.. మరో వారం పోస్ట్ పోన్ చేసుకొని జూన్ 3న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో అదే రోజున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మూవీకి పాన్ ఇండియా స్థాయిలో గట్టి పోటీ ఉండబోతోంది.
సీనియర్ హీరో కమల్ హాసన్ నటిస్తోన్న 'విక్రమ్' సినిమాని అదే రోజున రిలీజ్ ప్లాన్ చేశారు. కమల్ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి - ఫహద్ ఫాజిల్ వంటి విలక్షణ నటులు కూడా భాగమయ్యారు. 'ఖైదీ' 'మాస్టర్' ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది పాన్ ఇండియా మూవీ.
అలానే అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'పృథ్వీరాజ్' సినిమా సైతం జూన్ 3నే రిలీజ్ కానుంది. యష్ రాజ్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంపై బాలీవుడ్ జనాల్లో అంచనాలు ఉన్నాయి. హిందీతో పాటుగా తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఇక అజయ్ దేవగన్ నటించిన 'మైదాన్' చిత్రానికి ప్రస్తుతానికి అదే డేట్ ని లాక్ చేసి పెట్టారు. బోనీ కపూర్ కపూర్ నిర్మించిన ఈ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కాకపోతే మళ్లీ వాయిదా వేసే అవకాశం ఉంది.
ఏదైతేనేం మూడు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అంటే థియేటర్ల సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. ఒక దానిపై మరొకటి కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మరి వీటిల్లో చివరకు బరిలో ఏయే సినిమాలు నిలుస్తాయి? ఒకవేళ వాయిదా వేసుకోవాలనుకుంటే ఏ చిత్రాన్ని ముందుకు జరుపుతారనేది ఆసక్తికరంగా మారింది.
'మేజర్' చిత్రాన్ని మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ భాగస్వామ్యంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ నిర్మిస్తోంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. 26/11 ముంబై టెర్రర్ ఎటాక్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.