పెట్స్ అంటే మ‌లైకాకు ఎంత ప్రేమ‌!

Update: 2021-11-19 05:33 GMT
సోష‌ల్ మీడియాల్లో మ‌లైకా అరోరా నిరంత‌ర ఫోటోషూట్ల‌తో వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో అరుదైన‌ స్టైలిష్ ఐకాన్ గా వెలిగిపోతోంది. యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో మ‌లైకా ప్రేమాయ‌ణం నిరంత‌రం హాట్ టాపిక్. అంతేకాదు.. యోగా జిమ్ అంటూ మ‌లైకా ఫీట్స్ కి అద్భుత స్పంద‌న వ‌స్తుంటుంది. ఇక జాగింగ్ పేరుతో మ‌లైకా స్టింట్ గురించి తెలిసిందే. ఏదో ఒక‌ స్పెష‌ల్ యాక్ట్ తో ప్ర‌జ‌ల అటెన్ష‌న్ ని త‌న‌వైపు తిప్పేసుకోవ‌డంలో మ‌లైకా స్పెష‌లిస్ట్. తాను ఎక్క‌డ ఉన్నా షో స్టాప‌ర్ గా నిలుస్తోంది.

మలైకా అరోరా లో మ‌రో కోణం కూడా అంతే ఇంట్రెస్టింగ్. ఈ బ్యూటీకి పెట్స్ అంటే చాలా ప్రేమ‌. తాజాగా ఒక కుక్క పిల్ల‌కు మమ్మీగా మారింది. ఆ పెట్ డాగ్ ని పాంపర్ చేస్తూ మ‌లైకా కనిపిస్తుంది. మలైకా అరోరా గురువారం నాడు ఈ వీడియోని షేర్ చేశారు. దీనిలో ఆమె అందమైన పింక్ చీరలో కనిపించింది. పెంపుడు కుక్కతో ఆట‌లాడుతూ క‌నిపించింది. ఈ ఫోటోల మాంటేజ్ తో వీడియో వైర‌ల్ గా మారింది. మలైకా అరోరా నవ్వుతూ అలా త‌న పెట్ డాగ్ ని ముద్దాడేస్తోంది.

ఆ పెట్ కూడా త‌న‌ చుట్టూ తిరుగుతూ త‌న‌ని విడిచి ఉండ‌లేనంత ప్రేమ‌ను క‌న‌బ‌రిచింది. ఈ వీడియోను షేర్ చేస్తూ మలైకా అరోరా క్యాప్షన్ విభాగాన్ని కోకో - డాగ్స్ ఆఫ్ ఇన్ స్టాగ్రామ్- డాగ్ మామ్.. త్రోబాక్ థ‌ర్స్ డే వంటి హ్యాష్ ట్యాగ్ లను జోడించింది.

ఇక ఇన్ స్టా పోస్టుల్ని ప‌రిశీలిస్తే.. మలైకా అరోరా ఈ నెల ప్రారంభంలో జరిగిన అనిల్ కపూర్ దీపావళి పార్టీకి ధరించిన గెట‌ప్ ఇది. అనిల్ కపూర్ మేనల్లుడు తన బాయ్ ప్రెండ్ అర్జున్ కపూర్ తో కలిసి ఆమె ఈ వేడుక‌కు హాజరయ్యారు. ఇది త్రోబ్యాక్ వీడియో అని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

వాస్తవానికి అప్ప‌ట్లోనే అర్జున్ కపూర్ .. మలైకా అరోరా చెప్పిన లుక్ లో కనిపించానంటూ ఒక ఫోటోని కూడా అప్పుడు పంచుకున్నారు. అర్జున్ కపూర్ పోస్ట్ చేసిన ఫోటోలో ఇద్దరు స్టార్స్ కెమెరా వైపు పాక్షికంగా వెనుక వైపుగా క‌నిపించారు. ఆ జంట‌ నవ్వుతూ సంభాషణ సాగిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

మలైకా అరోరాకు పెట్స్ అంటే అపార ప్రేమ‌. నిజానికి ఆ పెట్ డాగ్ మలైకా వ్యాయామం చేయడానికి వెళ్లే ముందే ఆమెకు కంపెనీని ఇస్తుంటుంద‌ట‌. మలైకా అరోరా కుమారుడు అర్హాన్ ఖాన్ తోనూ కాస్పర్ ఎంతో జాలీగా గ‌డిపేస్తుంది. మలైకా అరోరా గతంలో నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకుంది. 19 సంవత్సరాల దాంప‌త్య జీవ‌నం తరువాత ఇద్దరు తారలు 2017లో ఎవ‌రి దారిలోకి వారు వెళ్లిపోయారు. చయ్య చయ్య- మున్నీ బద్నామ్ హుయ్ -కాల్ ధమాల్ వంటి అనేక హిట్ పాటల్లో మ‌ల‌కా కనిపించింది. టాలీవుడ్ మూవీ గ‌బ్బ‌ర్ సింగ్ లో కెవ్వు కేక పాట‌తో ఆక‌ట్టుకుంది.




Full View
Tags:    

Similar News