2021 NYE న్యూయార్క్ ని మిస్స‌వుతోంద‌ట‌

Update: 2020-12-24 02:30 GMT
అందానికి అందం సెక్స‌ప్పీల్ స్టైల్  ఇలా ఏ కోణంలో చూసినా మాళ‌విక మోహ‌న‌న్ ప్ర‌త్యేక‌తే వేరు. అందుకే ఆరంభ‌మే ఈ అమ్మ‌డికి కోలీవుడ్ అగ్ర హీరోలు అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పెట్టా త‌ర్వాత విజ‌య్ మాస్ట‌ర్ లో ఈ అమ్మ‌డు క్రేజీగా ఆఫ‌ర్ అందుకుంది.

టాలీవుడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న `హీరో` అనే చిత్రంలో అవ‌కాశం అందుకున్నా ఆ మూవీ మ‌ధ్య‌లోనే డీవియేట్ అవ్వ‌డం కొంత మైన‌స్. ప్ర‌స్తుతం మాళ‌విక కు టాలీవుడ్ లో  మెగా ఆఫ‌ర్లు వెల్లువెత్తే ఛాన్సుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మాళ‌విక ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.యు.మోహ‌న‌న్ కుమార్తె అన్న సంగ‌తి తెలిసిందే. ఫ్యాష‌న్ స్ట‌డీస్ మోడ‌లింగ్ అనంత‌రం సినీరంగంలో కెరీర్ ని సాగిస్తోంది మాళ‌విక‌. వ‌రుస‌గా క్రేజీ సినిమాల్లో ఆఫ‌ర్లు అందుకుంటోంది. ఇటీవ‌లే ధ‌నుష్ చిత్రానికి సంతకం చేసింది. మ‌సాబా గుప్తా జీవిత‌క‌థ ఆధారంగా రూపొందుతున్న మ‌సాబా మ‌సాబా సిరీస్ లోనూ మాళ‌విక న‌టిస్తోంది.

ఇక సోష‌ల్ మీడియాల్లోనూ మాళ‌విక ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నిరంత‌రం ఫోటో వీడియో ట్రీట్ తో అద‌ర‌గొడుతూ త‌న ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది ఈ హాట్ గాళ్. 2020 న్యూఇయ‌ర్ వేడుక‌ల కోసం న్యూయార్క్ కి వెళ్ల‌లేకపోతున్నాన‌ని క‌ల‌త చెందుతూ త్రోబ్యాక్ ఫోటో ఒక‌టి షేర్ చేసింది మాళ‌విక‌. ఇందులో టాప్ టు బాట‌మ్ బ్లాక్ లో బోల్డ్ లుక్ తో అద‌ర‌గొట్టింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది.Full View
Tags:    

Similar News